క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ప్ర‌పంచం అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. ఇక ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.. క‌ర్ఫ్యూలు విధించినా.. చివ‌ర‌కు లాక్ డౌన్‌లు పెట్టినా కూడా క‌రోనాకు బ్రేకులు ప‌డ‌డం లేదు. క‌రోనా గంట గంట‌కు మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. ఇక ఇప్పుడు రోగులు ఎక్కువ మంది పెరిగిపోవ‌డంతో చివ‌ర‌కు హాస్ప‌ట‌ల్స్‌, బెడ్స్.. మాస్క్‌లు.. గ్లోవ్స్ సైతం లేని ప‌రిస్థితి నెల‌కొంది. చివ‌ర‌కు భార‌త రైల్వే శాఖ రైల్వే బోగిల‌నే ఐసోలేష‌న్ వార్డులు ఏర్పాటు చేసింది.



చివ‌ర‌కు లండ‌న్ లాంటి చోట్ల ప‌రిస్థితి దిగ‌జారి ఎయిర్ పోర్టుల‌నే హాస్ప‌ట‌ల్స్‌గా మార్చేస్తున్నారు. చైనా లాంటి చోట్ల 10 రోజుల్లోనే హాస్ప‌ట‌ల్ క‌ట్టేస్తున్నారు. మ‌రో వైపు వీలైనంత మంది న‌ర్సులు.. వైద్య సిబ్బంది లేక‌పోవ‌డంతో వైద్యం అందించ లేని ప‌రిస్థితి.  ఇవ‌న్నీ భార‌తదేశం ముందు ఉన్న స‌వాళ్లుగా మార‌నున్నాయి. మ‌రోవైపు కరోనా ఆసుపత్రుల ఏర్పాటు కోసం కొన్ని మెడికల్ కాలేజీ హాస్టళ్లను ఖాళీ చేయించాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు.



చివ‌ర‌కు వైద్యులు లేక‌పోవ‌డంతో వైద్య విద్య చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతోన్న వారికి సైతం డ్యూటీలు వేస్తున్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా చిన్న జిల్లాల్లో 600 మంది ప‌డ‌క‌లు... ఢిల్లీ లాంటి మెట్రో న‌గ‌రాల్లో మూడు వేల ప‌డ‌క‌ల‌తో హాస్ప‌ట‌ల్స్ ఏర్పాట్లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనా ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే ఈ హాస్ప‌ట‌ల్స్ సైతం మ‌న‌ల‌ను కాపాడ‌లేవ‌న్న‌దే ఇప్పుడు ప్ర‌ధానంగా క‌నిపిస్తోన్న చ‌ర్చ‌.



మ‌న‌దేశంలోనూ రోజు రోజుకు క‌రోనా కేసులు పెరిగిపోతుండ‌డంతో స‌మయం మించిపోయేలా ఉంది. ఏదేమైనా ఇప్పుడు మ‌న ముందు పెద్ద స‌వాళ్లే ఉన్నాయి. మ‌న దేశంలో ప్ర‌తి ఒక్క‌రు ఒక్కో సైనికుడిలా మారి యుద్ధం చేయ‌క‌పోతే ప‌రిస్థితులు తీవ్ర‌మ‌య్యేలా ఉన్నాయి.




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: