కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను గడగడలాడించడమే కాదు ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోంది. క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఆ రంగం లేదు... ఈ రంగం లేదు.. ఓవ‌రాల్‌గా వ్య‌వ‌స్థ‌లు అన్ని స‌ర్వ‌నాశ‌నం అయ్యాయి. అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్ర‌పంచం తిరిగి ఎప్ప‌ట‌కి కోలుకుంటుందో కూడా తెలియ‌డం లేదు. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాకు ముందే లేదు.  కోవిడ్‌-19 వైర‌స్‌కు మందు క‌నిపెట్టే దిశ‌గా శాస్త్రవేత్తలు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈక్రమంలో ఇవి ఎప్ప‌ట‌కి స‌క్సెస్ అవుతాయో కూడా తెలియ‌డం లేదు.

 

అయితే కోవిడ్ వైర‌స్ విష‌యంలో  మాన‌వ శ‌రీరం నుంచి విడుద‌ల అయ్యే క‌ణాలు రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయ‌ట‌. దీంతో ఇప్పుడు వీళ్లు ఎన్ని ప‌రీక్షలు చేసినా అవి స‌క్సెస్ అవ్వ‌డం లేద‌ట‌. ఇక ఈ మహమ్మారి వల్ల అన్నిరంగాలు కుదేలైపోయాయి. మళ్లీ మాంద్యం మొదలైంది. 2007 త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన ఆర్థిక మాంద్యం దెబ్బ‌తో చాలా వ్య‌వ‌స్థ‌లు నాశ‌నం అయ్యాయి. 

 

అయితే ఇప్పుడు ప‌రిస్థితి అంత‌కంటే ఘోరంగా త‌యారైంది. 2009 నాటి కంటే కంటే పరిస్థితి దారుణంగా తయారైందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధినేత్రి క్రిస్టాలినా జార్జివా తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మాంద్యంలోకి వెళ్లిపోయామని స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు. మ‌న దేశం కూడా అభివృద్ధి చెందుతోన్న జాబితాలో ఉండ‌డంతో మ‌న‌పై కూడా ఈ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంది. అయితే ప్ర‌స్తుతానికి మ‌న‌కు ఉన్న ఒకే సంతోష‌క‌ర‌మైన వార్త ఏంటంటే ఇప్ప‌ట‌కీ మ‌నం క‌రోనాను కంట్రోల్ చేసుకోగ‌ల స్థితిలోనే ఉన్నాము. ఇక ప్ర‌పంచం ఎప్పుడు ఏమ‌వుతుందో ?  కూడా తెలియ‌ని పరిస్థితి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: