ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ లో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో విదేశీయుల నుండి వచ్చిన వారికీ డాక్టర్స్ వైద్య పరీక్షలు కరోనా పాజిటివ్ నిర్వహించి తెలుస్తారు. కరోనా రెండో దశలో కరోనా విదేశియుల నుండి వచ్చిన వారి కుటుంబ సభ్యులు, స్థానికులను కలవడం వలన వారికీ సోకుతుంది. మూడో దశలో కరోనా మహమ్మారి సమాజంలో వ్యాప్తి చెందడం మొదలవుతుంది. ఈ వ్యాధి సమాజంలో వ్యాప్తి చెందింది అంటే ఎవరి  నుండి వచ్చిందో కూడా నిర్దారణ చేయలేని స్థితిలో ఉంటుంది. ఎంత మందికి ఈ వ్యాధి సోకిందో అని అంచనా వేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

 

ఇప్పటి వరకు మన దేశంలో కరోనా రెండో దశలోనే ఉందని అధికారులు తెలుపుతున్నారు. కానీ భరత్ లో మూడో దశ మొదలైయ్యిందని కోవిడ్-19 ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ గిరిధర్ గ్యానీ సంచలన విషయం తెలిపారు. ప్రభుత్వం చెప్పనప్పటికీ ప్రస్తుతం మనం కరోనా మూడో దశలోనే ఉన్నామని టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ గిరిధర్ గ్యానీ అభిప్రాయపడుతున్నారు.

 


టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ గిరిధర్ గ్యానీ ప్రముఖ ఛానల్ లో ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను తెలిపారు. ఇకపై రానున్న ఐదు నుండి పది రోజులు ఈ వ్యాధిని అరికట్టేందుకు కీలకమన్నారు. ఈ వ్యాధి లక్షణాలు మరికొంత మందిలో కనిపిస్తున్నాయన్నారు. రానున్న రోజులో ఈ వ్యాధి విజృభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నటు ఆయన వెల్లడించారు.

 


ఇప్పటికే మన దేశంలో కరోనా వ్యాధికి సంబంధించిన కిట్స్ తక్కువగా ఉన్నాయన్నారు. తొందరగా కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నారు. చాలా వరకు మంది నర్సులు,హెల్త్ కేర్ సిబ్బందికి కరోనా చికిత్సపై శిక్షణ అందించాలన్నారు. మెడికల్ కాలేజీ, హాస్టళ్లను ఖాళీ చేసి అక్కడ కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని మోదీ తెలిపారు. కానీ ఆలా కాకుండా గత ఏడాది మెడికల్ విద్యార్థులను అక్కడే ఉండనివ్వాలన్నారు. అత్యవసర సేవల కోసం వారిని కూడా ఉపయోగించడం అవసరమని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: