ప్ర‌పంచాన్ని వ‌ణికించేస్తోన్న క‌రోనా వైర‌స్ అస‌లు ఎలా వ‌స్తుంది ?  గాలి ద్వారానా ?  నీటి ద్వారానా ?  లేదా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ‌స్త్రాలు.. ప‌దార్థాలు.. లేదా ఇత‌ర వ‌స్తువుల ద్వారానా ? అన్న‌ది అర్థం కావ‌డం లేదు. ఇక ఈ వైర‌స్‌కు ఇప్పుటి వ‌ర‌కు విరుగుడు .. మందు లేక‌పోవ‌డంతో ప్ర‌పంచం అంతా తీవ్ర ఆందోళ‌న‌లోకి వెళ్లిపోయింది. ఇక అనేక దేశాల్లో ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. మ‌రోవైపు ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికా లాంటి దేశాలు అయితే శ‌వాల దిబ్బ‌లుగా మారిపోతున్నాయి. 

 

ప్ర‌పంచాన్ని త‌న క‌నుసైగ‌ల‌తో శాసించే అమెరికాయే వ‌ణికి పోతోంది. ఇక మ‌న దేశం విష‌యానికి వ‌స్తే భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాపించడంతో ప్రజలు హడలిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ స్వ‌యంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. రాష్ట్రాలు చేతులు ఎత్తేయడంతో చాలా చోట్ల కేంద్ర బ‌ల‌గాలు కూడా వ‌స్తున్నాయి. ఇక ఈ వైర‌స్ వ్యాప్తి ఎలా వ‌స్తుందో ?  ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. తాజాగా ప‌శ్చిమ బెంగాల్‌లో ఒకే ఫ్యామిలీలో 9 నెల‌ల చిన్నారితో పాటు ఐదుగురికి క‌రోనా వ‌చ్చింది.

 

యూకే నుంచి వ‌చ్చిన ఓ యువ‌తితో లింక్ ఉన్న కుటుంబ స‌భ్యులు అంద‌రికి ఈ వైర‌స్ వ‌చ్చేసింది. కేవ‌లం ఒక్క యువ‌తి ఇత‌ర దేశాల నుంచి రావ‌డం.. ఆమెతో లింక్ ఉన్న కుటుంబ స‌భ్యుల‌ను ఆమె క‌ల‌వడంతోనే వాళ్లంద‌రికి కూడా వైర‌స్ సోకేసింది. పైగా ఇందులో 9 నెల‌ల చిన్నారి పాప కూడా ఉంది. తాజా కేసుల‌తో  పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ వ్యాధి సోకిన వారి సంఖ్య 15కు చేరింది. దీనిని బ‌ట్టి క‌రోనా విష‌యంలో మ‌నం ఎవ్వ‌రిని న‌మ్మ‌డానికి వీలులేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: