లోకంలో కరోనా కష్టాలు అన్ని ఇన్ని కావు.. బహుశా మనదేశంలోనే కావచ్చూ.. ఇలా మనుషులు ప్రవర్తించడం.. ఇలా ఎందుకు అనవలసి వచ్చిందంటే రోడ్డు మీద మనుషులు కనిపిస్తే చితక్కొట్టుడు అనే కార్యక్రమానికి తెరతీసారు పోలీసులు.. దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. రోడ్లపై ఎవరు కనిపించిన వారు ఎవరు, ఎందుకు బయటకు వచ్చారు అనే విషయాలు తెలుసుకోకుండా.. ఒకటే మోత.. లాఠీలతో వేటాడూతూ, పరిగెత్తించుకుంటూ ఉతుకుతున్నారు.. అందుకే కారణం లేకుండా బయటకు వెళ్లకూడదు.. ఒకవేళ కాదని చెప్పిన మాట వినకుండా రోడ్లన్ని ఖాళీగా ఉన్నాయని బైటకు వెళ్లారో చిన్నప్పటి ఉగ్గుపాలు గుర్తుకు వస్తాయి..

 

 

ఇక పోలీసులు ఇలా ప్రవర్తించడం వల్ల వీరి తీరుపై అక్కడక్కడా విమర్శలు వస్తున్నాయి. అకారణంగా అమాయకుల పై లాఠీలతో దాడి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దశలో ఒకరిద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. అయినా కొంతమంది తీరు మార్చుకోవడం లేదు. అనవసరంగా అమాయకులపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. అయినా వారుకూడా ఏం చేస్తారు.. ఇంత కాలం హాయిగా డ్యూటీలు చేసుకున్న అలవాటుకు ఇప్పుడు రోడ్లమీద ఇలా ఉండటం వల్ల, అందులో కరోనా అనే టెర్రరిస్ట్ భయంకరంగా విధ్వంసాన్ని సృష్టిస్తుంటే.. బాధతో కూడుకున్న ఆవేశంలో అలా ప్రవర్తిస్తూ ఉండవచ్చూ..

 

 

అయితే ఈ లాక్‌డౌన్ మాత్రం నెల్లూరులో సీన్ ను రివర్స్ చేసింది.. ఇద్దరి కానిస్టేబుళ్ల మధ్య చిచ్చు పెట్టింది.. ఇంతకు జరిగిన విషయాన్ని తెలుసుకుంటే నెల్లూరులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ కుమారుడు బైక్‌పై రోడ్డుపైకి వచ్చాడు.. అసలే పోలీసు లాఠీలు మంచి ఆకలిమీద ఉన్నాయి.. ఇంకేం ఉంది.. అక్కడే విధుల్లో ఉన్న మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడ్ని రెండు దెబ్బలు కొట్టాడట. దీంతో ఆ యువకుడు కానిస్టేబుల్ అయినా అతని తండ్రికి విషయం చెప్పడంతో, వెంటనే సదరు కానిస్టేబుల్ నేరుగా స్పాట్‌కు వచ్చీ రాగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కాపట్టుకుని యుద్దానికి సిద్దమైన వాడల్లే ప్రవర్తిస్తూ, బూతు పురాణం మొదలెట్టాడట..

 

 

ఇలా వీరిద్దరు గొడవకు దిగడంతో అక్కడే ఉన్న జనాలు వారిని విడిపించారట.. తర్వాత ఇద్దరు ఒకరిపై మరొకరు ఎస్పీకి ఫిర్యాదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సామాన్యప్రజలకు ఒక న్యాయం. డిపార్ట్‌మెంట్ పిల్లలకు ఒక న్యాయమా.. ఎవరు చేసిన తప్పు తప్పే.. అని నెటిజన్స్ అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: