కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. దీన్ని కట్టడి చేయడం అనేది ఇప్పట్లో సాధ్యం కాని పని అనే విషయం అన్ని దేశాలు అంటున్నాయి. వైరస్ ని చంపాలి అంటే మనిషి ఎక్కడ ఉన్న వాడు అక్కడే ఉండాలి. కాని ఇప్పుడు అది చాలా దేశాల్లో సాధ్యం కావడం లేదు. కొంత మందికి దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం కావడం లేదు. కరోనా వైరస్ కి మందు అనేది ఎక్కడా లేదు. దాన్ని అదుపు చేయడం కూడా మన చేతిలో దాదాపుగా లేని పని. దాన్ని అదుపు చెయ్యాలి అంటే... మనిషికి మనిషి దూరంగా ఉండటమే. 

 

ఇప్పుడు ఇదే అన్ని రంగాలను భారీగా దెబ్బ కొడుతున్న విషయం. దాని నివారణకు తీసుకునే చర్యలు అంటూ ఏమైనా ఉన్నాయి అంటే సామాజిక దూరమే. అత్యవసరమైతే మినహా ఏ కంపెనీ కూడా తెరవడం లేదు. అందులో కండోం తయారి కంపెనీలు కూడా ఉన్నాయి. వాటి ఉత్పత్తి దాదాపుగా నిలిచి పోయింది. పది రోజు నుంచి కూడా ఏ ఒక్క కంపెనీ కూడా వాటిని ఉత్పత్తి చేయడం లేదు. దీనితో వాటి కొరత అనేది క్రమంగా పెరుగుతుంది. కండోం తయారికి మలేషియా దేశంలోని కారెక్స్ బీహెచ్‌‌డీ అనే కంపెనీ తన ఉత్పత్తిని దాదాపుగా ఆపేసింది. 

 

మలేసియాలో గత 3 కంపెనీల్లో కండోమ్ ఉత్పత్తి దాదాపుగా ఆగిపోయింది. మలేషియా ఒక్కటే కాదు. ఇతర దేశాల్లో కూడా వాటి తయారి ఆగిపోవడంతో సుమారు 100 మిలియన్ల కండోమ్ కొరత ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది. వైరస్ వల్ల కండోమ్‌ ఉత్పత్తి నిలిచిపోయిందని కారెక్స్ కంపెనీ సీఈవో గోహ్ మిహ్ కియట్ రాయిటర్స్ వార్తా సంస్థకు వివరించారు. ఈ పరిణామం ఆందోళనకు గురిచేస్తోందన్న ఆయన... కండోమ్‌ల కొరత వారమో, రెండు వారాలకో పరిమితం కాదని చెప్తూ... నెలల పాటు కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: