కరోనా.. కనికరం లేకుండా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో..  ఇండియా హెరాల్డ్ మీకు అందిస్తోంది.. తాజా కేసుల వివరాలను... లెక్కలను. ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్నట్లైతే, ప్రస్తుత బాధితుల సంఖ్య 614,393 కు  చేరుకుంది. అందులో 28,242 మంది స్వర్గస్తులవ్వగా.. 137,329 మంది కరోనా కోరలనుండి బయట పడినట్లు తెలుస్తోంది. ఇక మన ఇండియాలో కరోనా వైరస్ కేసులు 933 నమోదు కాగా, 46 కొత్తవి నమోదు అయినట్లు సమాచారం. ఇందులో 20 మంది ప్రాణాలు కరోనా హరించగా, మిగిలినవారు ప్రమాదపు  అంచునుండి, బయట పడవచ్చని పలువురు ఆరోగ్య నిపుణులు ధీమాని వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక మన తెలుగు కరోనా బాధితుల సంగతి చూస్తే... పెద్ద మార్పులు, చేర్పులు కనబడనప్పటికిని, రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరగడం, ఒకింత బాధాకరమే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు 72 కేసులు నమోదు కాగా.. తెలంగాణా లో 59 కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 13 కేసులు నమోదు అయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని ముందే అరికడితే, ఈమాత్రం ఎఫెక్ట్ కూడా ఉండేది కాదని పలువురు ప్రముఖులు ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్నారు.

 

ప్రపంచం నుండి, రాష్ట్రం వరకూ ఎవరికి తోచినంతలో వారు కరోనాను కట్టడి చేయడానికి విరాళాల రూపంలో కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ప్రపంచ దేశాలకు ట్రంప్ పెద్ద మొత్తంలో విరాళాల్ని ప్రకటించిన సంగతి తెలిసినదే. క్రికెటర్ల నుండి సినీ సెలిబ్రిటీస్ వరకూ... అందరూ తమ స్థాయికి తగ్గట్లు విరాళాలను పెద్ద మనసుతో ప్రకటిస్తున్నారు. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ 2 కోట్లు విరాళం ప్రకటించి, మరోసారి తన దాతృత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: