కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుంది. రోజు రోజు ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య రెట్టింపు అవుతూనే ఉంది. దేశంలో ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కరోనా వేగం మాత్రమం తగ్గటం లేదు. ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా ఇంట్లోనే ఉంటూ చిన్న, చిన్న చిట్కాలు పాటించాలని వైద్యులు తెలుపుతున్నారు. 

 

ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే రోజుకు పది, పన్నెండు సార్లు చేతులు కడుక్కోవాలి. శానిటైజర్, మాస్క్‌లు ఉపయోగించాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. అలాగే సామాజిక దూరం కచ్చితంగా పాటించాలంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ కూడా ఓ చిట్కా పాటించాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తనకు తెలిసిన చిట్కాను అందరితో పంచుకున్నారు.

 

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలపట్టుకుంటుంటే కొరియా లాంటి దేశాల్లో చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారన్నారు నారా లోకేష్. అందులో ప్రధానమైనది.. అలవాటైన చేతిని ఎక్కువగా వాడకూడదు. కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో.. ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడం లాంటి పనులు చెయ్యలన్నారు. తద్వారా ఆ చేతితో మొహాన్ని తాకడం తగ్గుతుందన్నారు. 

 

ఈ చిన్న జాగ్రత్త కొంతవరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుందంటున్నారు. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమేనన్నారు. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి అంటున్నారు ఈ ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: