ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 615970 కి చేరుకోగా... 28, 375 మంది చనిపోగా... మొత్తం 1, 37, 336 మంది కోలుకున్నారు. తాజా నివేదికల ప్రకారం... పాకిస్థాన్ దేశంలో ఇప్పటివరకు మొత్తం 1408 మందికి కరోనా వైరస్ సోకగా... 11 మంది కరోనా బాధితులు మరణించారు. ఇంకో 7 గురి బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అధిక కేసులు(మొత్తం 490) నమోదవుతున్నాయని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఆస్ట్రేలియా దేశంలో 202 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 3, 378 చేరుకుంది. ఈరోజు ఒక వృద్ధురాలు కోవిడ్ 19 వ్యాధి కారణంగా చనిపోగా ఆస్ట్రేలియా దేశంలో మరణాల సంఖ్య 14 చేరుకుంది.

 

 

ఇప్పటివరకు చూసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఇటలీలో 86, 500 కేసులు నమోదు కాగా... మొత్తం 9, 134 కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. ఇటలీ తర్వాత స్పెయిన్ లో ఎక్కువ కరోనా కేసులు నమోదవడంతో పాటు కేవలం 24 గంటల సమయంలో 832 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకైతే స్పెయిన్ లో మొత్తం 72, 248 కేసులు నమోదు కాగా... 5, 690 కరోనా మరణాలు నమోదయ్యాయి.




ఇక మన భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం చూసుకుంటే... రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య శాఖ మంత్రి నివేదికల ప్రకారం... ఇప్పటి వరకు కోవిడ్-19 మరణాలు 22 నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 939 కి చేరుకుంది. అయితే ప్రస్తుతం 79 మంది కరోనా బాధితులు కోలుకోగా... 837 మంది కోవిడ్ 19 చికిత్స పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం గురించి చెప్పుకుంటే... ఆంధ్రప్రదేశ్ లో 14 మంది కి కరోనా చికిత్స పొందుతుండగా ఒక్కరికి నయం అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో 55 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా 10 మందికి వ్యాధి నయం అయ్యింది. ఇప్పటివరకైతే తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కరోనా బాధితుడు చనిపోయాడు. మృతుడు ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన ఆయనకి 74 సంవత్సరాలు ఉన్నాయి.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: