తెలంగాణ‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. శ‌నివారం ఖైర‌తాబాద్‌కు చెందిన 74 ఏళ్ల వృద్ధుడు క‌రోనాతో మృతి చెందారు. ఇక ఇది గాలి ద్వారా సోకే వ్యాధి కాదు...  హైద‌రాబాద్‌లో ఎక్క‌డ రెడ్ జోన్లు లేవు అని కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. ఇక అనుమానం ఉన్న వారి విష‌యంలో క‌రోనా శాంపుల్స్ సేక‌ర‌ణ కొనసాగుతోంది.. ఈ రోజుతో 65 మంది కి పాజిటివ్ వ‌చ్చింది... ఖైర‌తాబాద్‌లో చనిపోయిన వ్య‌క్తి కుటుంబ స‌భ్యుల‌ను క్వారంటైన్‌లో ఉంచామ‌ని తెలిపారు. 

 

ఇక స‌ద‌రు చ‌నిపోయిన వ్య‌క్తికి ట్రావెల్ హిస్టరీ ఉందని తేలడంతో పరీక్షలు నిర్వహించామన్నారు. కుత్బుల్లాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన మరో న‌లుగురికి... అలాగే పాత‌బ‌స్తీలో ఒకే కుటుంబానికి చెందిన మ‌రో ఆరుగురికి కోవిడ్ సోకిందని ఈటల తెలిపారు. చనిపోయిన వ్యక్తి, ఈ ప‌దిమందితో కలిపితే.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 65కు చేరిందన్నారు. ఇక క‌రోనా ఎలా వ‌స్తుంద‌న్న‌ విష‌యంలో ఇప్ప‌టికే అనేక మందికి సందేహాలు ఉన్నాయి. 

 

ఈ క్ర‌మంలోనే దీనిపై సైతం ఈట‌ల క్లారిటీ ఇచ్చారు. ఇది గాలి ద్వారా సోకే వ్యాధి కాద‌ని చెప్పారు. అదే టైంలో క‌రోనాపై సోష‌ల్ మీడియా ద్వారా లేనిపోని అపోహ‌లు ప్ర‌చారం చేసే వారి విష‌యంలో చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ కూడా ఇచ్చారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: