తెలంగాణాలో కరోనా వైరస్ కేసులకు సంబంధించి ఆ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర కీలక ప్రకటన చేసారు. తెలంగాణాలో తొలి కరోనా మరణం సంభవించినట్టు మంత్రి వివరించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తూనే... తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 65 కి చేరిందని అన్నారు. నిన్న సాయంత్రం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒక్క రోజే కరోనా కేసుల సంఖ్య 10 పెరిగిందని చెప్పారు. 

 

అలాగే ఒక కుటుంబంలో ఆరుగురికి, మరో కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్ సోకిందని ఆయన వివరించారు. ఈ రెండు కుటుంబాల సభ్యులను క్వారంటైన్ కి తరలించామని అన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా మరణించిన 74 ఏళ్ళ వృద్దుడి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ చేసామని కరోనా వైరస్ బాధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వారి ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన అన్నారు. కరోనా వైరస్ గాలి ద్వారా వచ్చే వ్యాధి అసలు కాదని కాబట్టి ఎవరూ కూడా భయపడవద్దని చెప్పారు. 

 

విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు మినహా ఎవరికి కరోనా వైరస్ లేదని అన్నారు. ఈ రోజు ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్ అని వచ్చినట్టు ఆయన వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని ఆయన సూచించారు. క్వారంటైన్ లో ఉన్న వారి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుందని చెప్పారు. పాత బస్తీ నాంపల్లి, కుత్బుల్లాపూర్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో ఓపీ సేవలు పూర్తిగా ఆపెసామని వాటిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: