ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ దాడికి అల్లకల్లోలం అయిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి కరోనా వైరస్ ఇంతటితో ఆగితే పర్వాలేదు లేదంటే ఈ వైరస్ వల్ల చాలా ప్రాణాలు గాలిలో కలిసిపోవాలిసిందే అంటున్నారు నిపుణులు. అసలు ఈ వైరస్ ఎప్పుడు, ఎంత మంది, ఎన్ని దేశాలలో వ్యాప్తి చెందిందో చూస్తే అవాక్ అవుతారు. అసలు  2019 డిసెంబర్లో చైనాలో మొదలైన కరోనా వైరస్ మొదట్లో మెల్లగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించింది. వుహాన్‌లో అసాధారణ న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయని 2019  డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థను చైనా అప్రమత్తం చేసింది. ఎందుకు ఇలాంటి  ఊపిరితిత్తుల సమస్యతో ప్రజలు ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారు అని ఆరా తీయగా అప్పుడు తెలిసింది కరోనా వైరస్ ఎఫెక్ట్ అని. అంతే జనవరి 11న కరోనా కారణంగా తొలి మరణం నమోదు అయింది. 

 

 

 

కొద్దిరోజుల్లో ఈ వైరస్ చైనాను వణికించింది. జనవరి 22 నాటికి ఈ వైరస్ కారణంగా 17 మంది చనిపోగా 550 మంది దీని బారిన పడటంతో చైనా అప్రమత్తమైంది. మరుసటి రోజే వుహాన్‌‌లో క్వారంటైన్ అమలు చేయడంతోపాటు రైళ్లు, విమానాల రాకపోకలను నిలిపేసింది. జనవరి 30న వరకు చైనాలో 170 మంది చనిపోగా 7711 కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ తొలి కరోనా కేసు నమోదైంది. చైనా లోని వుహాన్ నుంచి తిరిగొచ్చిన కేరళ స్టూడెంట్‌కి  కోవిడ్ పాజిటివ్ అని తేలింది.అంతే భారత దేశం అప్రమత్తం వహించింది.  చైనా లో అప్పటికి మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనితో  ఫిబ్రవరి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్‌కు కోవిడ్-19 అని పేరు పెట్టింది. ఆ సమయానికి చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య 1016కు చేరగా.. 42,638 మంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. మార్చి 2న భారత్‌లో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. మార్చి 7 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 102,000కు చేరింది. అప్పటికే ఈ వైరస్ 90 దేశాలకు వ్యాపించగా 3500 మంది మరణించారు. 

 

 

 


ఇప్పటి వరకూ చైనాలో 80,651 కేసులు నమోదు కాగా.. మరణించిన 3500 మందిలో ఎక్కువ మంది చైనీయులే. ఈ సమయానికి దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీల్లోనూ కోవిడ్ విజృంభణ మొదలైంది.మార్చి 15 నాటికి చైనాలో కరోనా అదుపులోకి వచ్చింది. కాగా స్పెయిన్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 7700 దాటింది.చివర్లో కరోనా కేసులను గుర్తించగా.. మార్చి 6 వరకు లక్ష కేసులు నమోదు కాగా.. తర్వాత కోవిడ్ దూకుడు పెరిగింది. అప్పటికే మిగతా ప్రపంచ దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించడంతో.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మార్చి 28 నాటికి ఆరు లక్షలకు చేరింది. అంటే మూడు వారాల్లో కొత్తగా ఐదు లక్షల మంది కరోనా బారిన పడ్డారు.  2-3 లక్షలు, 3-4 లక్షల కేసులకు చేరడానికి మూడు రోజుల వ్యవధి పట్టింది.  దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీల్లో కరోనా విజృంభణ అధికంగా ఉంది. ఇప్పటికీ ఇటలీతోపాటు స్పెయిన్ కోవిడ్ దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఇటలీలో 87 వేల మందికి కోవిడ్ సోకగా.. 9 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోనైతే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. బ్రిటన్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇదే రీతిలో కరోనా కేసుల సంఖ్య పెరిగితే మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య పది లక్షలు దాటే అవకాశం ఉంది. 

 

 

 

ఒక వేళ భారత్‌లోనూ కోవిడ్ కేసుల సంఖ్య పెరిగితే.. అది కొద్ది రోజుల్లోనే 50 లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మన భారతదేశం ముందుగానే సరైన టైములో సరైన నిర్ణయం తీసుకుని ముందుగానే జాగ్రత్త పడింది. కరోనా విజృంభణ ఆదిలోనే అంతం చేయాలనీ లాక్ డౌన్  ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో సగం కేసులు యూరప్ దేశాల్లోనే నమోదు అయ్యాయి. అయితే అమెరికాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు  చుస్తే హడలెత్తిస్తోంది. అన్ని సదుపాయాలు ఉన్న అగ్రదేశం అయిన అమెరికానే కోవిడ్ వల్ల విలవిల లాడిపోతుంది. 

 

 


ఇప్పటికే 104,027 మంది కోవిడ్ బారిన పడగా.. 1700 మందికిపైగా ఇక్కడ చనిపోయారు. దాదాపు 140 కోట్ల జనాభాలో ఉన్న చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య 82 వేలలోపు ఉండగా.. 30 కోట్లకుపైగా జనాభా ఉన్న అమెరికాలో ఆ సంఖ్య లక్ష దాటింది. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ గూర్చి ముందుగానే జాగ్రత్త వహిస్తే ఇంత నష్టం వాటిల్లేది కాదు. ఎక్కడో చైనాలో వచ్చింది మనల్ని ఏమిచేస్తుంది అనే  నిర్లక్ష్య ధోరణి  వల్ల ఇంత మంది బాధ పడుతున్నారు. దక్షిణ అమెరికా, చైనా, ఇరాన్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. అయితే మిగతా ఆసియా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ దేశాల్లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటే  పరిస్థితి ఉహించుకోలేము. అలాంటి పరిస్థితి వస్తే ప్రాణ నష్టాన్ని ఊహించుకోలేం. మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నాగాని  మన భారత  దేశంలో కరోనాను అదుపు చేయలేము. ఎందుకంటే జనాభా కూడా ఎక్కువే. ఇప్పటికే మన భారత దేశంలోనూ కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగింది. 

 

 


అయితే వైరస్ వ్యాప్తి అరికట్టడం అనేది మన చేతుల్లోనే ఉంది. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలోనే ఉండి, బయటకు రాకుండా స్వచ్చంధ బంద్ పాటిస్తే మాత్రం కరోనాని తరిమి కొట్టవచ్చు.  మనతో పాటు మన కుటుంభ సభ్యులని, మన తోటివారిని, మన దేశాన్ని కాపాడుకోగలుగుతాము. స్వచ్చందంగా లాక్ డౌన్ ని పాటిద్దాం. నాకు ఏమి అవుతుంది అనే నిర్లక్ష ధోరణిని పక్కన పెడదాం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: