సమాజంలో చెడు ఆకట్టుకున్నంత త్వరగా మంచి ఆకట్టుకోదు.. ఇందుకు నిదర్శనమే మన ఇండియాలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య.. ఇప్పటి వరకు ప్రభుత్వం మాటలను, అధికారుల నీతులను పట్టించుకోకుండా బ్రతికాము.. కానీ రోజులు ఎప్పటికి ఒకేలా ఉండవు.. చెడ్డవాన్ని కాలామే శిక్షిస్తుంది.. కాలమే బుద్ధి చెబుతుంది అంటారు.. ఆ సమయం రానే వచ్చింది.. కాలం ప్రతి వారిని శిక్షిస్తుంది.. అయితే ఈ శిక్షనుండి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం.. అదే సొషల్ డిస్టెన్స్..

 

 

ఒకరికి ఒకరు ఎంత దూరం పాటిస్తే అంత మంచిది.. అసలు ఇంట్లో నుండి బయటకు వెళ్లకపోవడమే మంచిది.. ఇప్పుడు వచ్చిన ఈ కరోనా వైరస్ బలం చూస్తూంటే అంత సులువుగా లొంగేలా కనిపించడం లేదు.. ఎందుకంటే అగ్రరాజ్యాలకు సైతం అందకుండా తప్పించుకు తిరుగుతుంది.. ఇన్ని వందల దేశాలు, ఆధునిక టెక్నాలజీ, అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం ఇవన్నీ కూడా ఈ కరోనా చావులను ఆపలేక పోతున్నాయి.. అందమైన దేశాలు అంధకారంగా మారుతున్నాయి.. కాలం కన్నెర్ర చేస్తే దాని తాలూకూ పర్యావసనం ఎలా ఉంటుందో ఇప్పటికైన అర్ధం చేసుకుంటే మంచిది..

 

 

ఇక మన దేశంలో ఉన్న వైద్య సిబ్బంది చాలా తక్కువ.. హస్పిటల్స్‌లో ఉన్న సౌకర్యాలు అంతంత మాత్రమే.. ఇలాంటి సమయంలో ఇవేమి గ్రహించకుండా కరోనా నన్ను ఏం చేయలేదని దైర్యంగా బయట తిరగడం బుద్ధిమంతుల లక్షణం కాదు..  సాక్షాత్తు మోదీ గారు కన్నీరు పెట్టుకుంటు వేడుకుంటున్నారంటే పరిస్దితిని అర్ధం చేసుకోండి.. ఒక మంచి పనికి మంచి మనసున్న ఒక్కరో ఇద్దరో కలిస్తే ఆ పని సఫలం అవదు.. పాకిస్దాన్ మనదేశ సైనికులను హతమారుస్తే వందల, వేయిల పిడికిళ్లు బిగుసుకున్నాయి.. ఒక అమాయకురాలు హత్యాచారానికి గురై చనిపోతే వేయిల గొంతుకలు తుపాకీ తూటాల్లా మోగాయి.. మరి ఈ స్పూర్తి ఇప్పుడు కరోనా విషయంలో ఎక్కడ పోయింది..

 

 

పాఠాలు చదవకుంటే మాష్టారుతో చిన్నప్పుడు తన్నులు తిన్నాం, తప్పుచేసి తల్లిదండ్రులతో చివాట్లు పడ్డాం.. బుద్ధి వచ్చాక పోలీసులతో దెబ్బలు తినడం అవసరమా.. ఇక కరోనా నుండి బయటపడాలంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశలు లేవు.. నిన్ను కాపాడటానికి ఎవరు రారు.. నీకు నువ్వే రక్షించుకోవాలి.. పరిస్దితి చేయి దాటిపోయాక అయ్యో రామ అంటే భగవంతుడు కూడా ఆదుకోడు.. దయచేసి ప్రాణాలు రక్షించుకోండి, ఇతరుల ప్రాణాలు రక్షించండి.. ఈ పుణ్యభూమిని మాత్రం శవాల దిబ్బగా మార్చకండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: