కరోనా వైరస్ ని కట్టడి చేయలేమని ఎన్ని దేశాలు ఎన్ని విధాలుగా మొత్తుకుంటున్నా సరే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దానిని చాలా మంది ప్రజలు కామెడీగా చూస్తున్నారు. అక్కడ ఉన్న వైరస్ తమకు రాదంటే రాదని దాని మీద సెటైర్లు వేస్తూ ఇష్టం వచ్చిన వాదనలు చేస్తున్నారు. ఒక పక్క ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, అమెరికా వంటి దేశాలు కరోనా వైరస్ కి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అయినా సరే ప్రజలు మాత్రం ఏ విధంగా మార్పు రావడం లేదు.

 

 ఒకపక్క ప్రాణాలతో భయపడుతున్నా  సరే ప్రజలు మాత్రం కంట్రోల్ అవటం లేదు. రోడ్ల మీద కు రావద్దని ఎన్ని విధాలుగా ప్రభుత్వం చెబుతున్నా రోడ్ల మీదకు వచ్చి ఇతరుల ఆరోగ్యాన్ని కూడా ఆందోళనకు గురి చేస్తున్నారు. కొందరు ఈ నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ని రాష్ట్రపతి ఆమోదంతో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అది ఏంటి అంటే ఉదయం 6 నుంచి ఉదయం 9 గంటల వరకు ఆ తర్వాత ప్రజలెవరూ బయటకు రాకూడదు. అత్యవసర సేవలు మినహా ఏ విధంగా కూడా ప్రజలు బయట కనపడిన సరే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

 

ఇప్పటికే దీనిపై ప్రధానమంత్రి, కేంద్ర హోం శాఖ చర్చించారని రాష్ట్రపతి ద్వారా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి, అన్ని రాష్ట్రాల్లోనూ పక్కాగా అమలు చేయాలని, అప్పుడే ప్రజలు కంట్రోల్ అవుతారని, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలను దృష్టి లో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో కూడా కేంద్ర హోంశాఖ చర్చలు జరిపినట్టు సమాచారం. త్వరలోనే ఉన్నతాధికారులు ఈ ఆర్డినెన్స్ సిద్ధం చేసి ఆమోదింప చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: