మహారాష్ట్రలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనబడటం లేదు. దాదాపు 200 కు పైగా కేసులు నమోదు కావడం అదేవిధంగా మరణాలు కూడా ఎక్కువగా నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దాదాపు అక్కడి ప్రభుత్వం తరఫున వైరస్ పై  పోరాడలేక చేతులెత్తేసినట్లే కనబడుతోంది. దాదాపు మహారాష్ట్రలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 250కి పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

 

అయితే అక్కడి ప్రభుత్వం ప్రజలు ఆందోళన చెందకుండా తక్కువ అని చెప్తునారు అని అంటున్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే మహారాష్ట్ర దాదాపు చేతులెత్తేసినట్లే కనబడుతోంది. అక్కడ మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఒకటి ముంబై, రెండు నాగపూర్, మూడు పూణే. ఈ మూడు విమానాశ్రయాల నుంచి భారీగా విదేశీయులు మహారాష్ట్రకు వచ్చారు. వారందరూ కూడా స్వగ్రామాలకు వెళ్లి పోవడం, ఎవరి ఇళ్లకు వాళ్ళు కనీస భాద్యత లేకుండా గత రెండు నెలల నుంచి వెళ్లిపోవడంతోకరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

 

 

కరోనా  లక్షణాలు ఉన్న వాళ్ళు ఆసుపత్రుల బాట పట్టడంతో అక్కడ టైం కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహారాష్ట్రలో ఎక్కువగా వలస కూలీలు ఉంటారు. వాళ్ళు అందరూ కూడా అక్కడి నుంచి మరో ప్రాంతానికి కూడా తరలించినట్టు సమాచారం. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు నుంచి ఉల్లి చెరుకు సహా అనేక పనులకు ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఇప్పుడు వారందరూ కూడా కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం కేంద్రం సహాయం కోరుతుంది. ముంబై లో ఉన్న మురికి వాడల్లో కరోనా వైరస్ వ్యాపించింది. దీనితో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. అది ఏ విధంగా కట్టడి అవుతుందో అర్ధం కావడం లేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: