అస‌లు క‌రోనా వైర‌స్ ఎక్క‌డ పుట్టింది ?  ఎక్క‌డ నుంచి వ‌చ్చింది ?   ఎలా పాకుతోంది ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక స‌మాధానం చైనాలోని వుహాన్ న‌గ‌రం. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ న‌గ‌రం పేరు గురించే ఎక్క‌డ చూసినా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక ఇప్పుడు క‌రోనా వైర‌స్ ఎవ‌రి సృష్టి అన్న ప్ర‌శ్న‌కు ప్ర‌పంచం అంతా చైనా వైపే చూపిస్తోంది. ఇక్ మిగిలిన దేశాల కంటే అగ్ర‌రాజ్యం అమెరికా ఒక అడుగు ముందుకు వేసి చైనాపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తోంది.

 

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. చివ‌ర‌కు అంత‌ర్జాతీయ స‌మాజం సైతం చైనాను దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే అమెరికాతో పాటు ప్ర‌పంచంలో ఉన్న అన్ని దేశాలు డ్రాగ‌న్ కంట్రీని టార్గెట్ చేస్తుండ‌డంతో అమెరికా విమర్శ‌ల‌ను చైనా తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. అస‌లు ఈ వైర‌స్తో త‌మ‌కు సంబంధం లేద‌ని వాదిస్తోంది. ఇదంతా అమెరికా క్రియేట్ చేసింద‌ని అంటోంది. 

 

చైనాలోని వుహాన్ మార్కెట్లో అనేక ర‌కాల సీ ఫుడ్స్ అమ్ముతర‌ని అక్క‌డే అనేక ర‌కాల జంతువుల మాంసాల‌ను కోసి అమ్ముతార‌ని.. కొద్ది రోజుల క్రితం అమెరికా సైనికులు అక్క‌డ‌కు వ‌చ్చార‌ని.. వారే ఈ వైర‌స్‌ను వుహాన్‌లో సీ ఫుడ్ అమ్మే మార్కెట్ ప‌క్క‌న వ‌దిలి వెళ్లార‌ని చైనా ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఏదేమైనా ఈ రెండు దేశాల ఆధిప‌త్య పోరులో ఈ రోజు ప్ర‌పంచ దేశాలే స‌ర్వ‌నాశ‌నం అవుతున్నాయి. ఇక‌పై అయినా ఇలాంటి ఆరోప‌ణ‌లు ప‌క్క‌న పెట్టి అన్ని దేశాలు ఒక్క‌టై ఈ మ‌హ‌మ్మారిని తరిమి కొట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇక‌పై అయినా మేల్కోన‌క‌పోతే ప్ర‌పంచ వినాశ‌న‌మే అవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: