కరోనా వైరస్ కేసులు రాబోయే రెండు వారాల్లో భారత్ లో మరింత గా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఎప్పటి లాగే పెరుగుతూ పోతుంది. దీనికి మందు లేకపోవడం ప్రజలు కూడా మాట వినకపోవడం తో ఇప్పుడు కరోనా బాగా విస్తరిస్తోంది. క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించిన కరోనా వైరస్ ఇప్పుడు దాదాపు మన దేశంలో అన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తుంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కరోనా తన ప్రభావం చూపిస్తోంది.

 

ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా దానిని అడ్డుకోవాలని చూసినా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా లాక్ డౌన్ ప్రకటించిన కరోనా మాత్రం ఆగడంలేదు. విదేశాల నుంచి భారీగా కొంతమంది వచ్చేసి వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం వైద్య పరీక్షలు కూడా చేపించుకోక పోవడంతో ఇప్పుడు వారందరికీ కరోనా వైరస్ క్రమంగా బయట పడుతోంది. వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళకి, వాళ్ళు షాపులో కి వెళ్ళినప్పుడు, షాపులో ఉన్న వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇలా ప్రతి ఒక్కరి కి వైరస్ సోకే అవకాశాలు కనబడుతున్నాయి.

 

మన దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితు ల్లో వైద్య సదుపాయాలు, రోగుల సంఖ్య పెరిగితే పరిస్థితి ఏంటి అని ఆందోళన ఇప్పుడు ప్రభుత్వ అధినేతలను వెంటాడుతోంది. ఎంత ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం అయినా సరే ఆ దెబ్బకు ఇప్పుడు కూలిపోయే పరిస్థితి ల్లో కనబడుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా రాష్ట్రాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ధనిక రాష్ట్రాలు కూడా ఎదుర్కోలేక సతమతమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. కరోనా ఎదుర్కోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో వెయ్యికి దగ్గరగా ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: