ఒకపక్క ప్రపంచదేశాలు కరోనా వైరస్ కు చిగురుటాకులా వణికిపోతోంది. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ సహా అనేక దేశాల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. మన దేశంలో కూడా అత్యంత వేగంగా ఈ కరోనా వైరస్ విస్తరిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ధాటికి ఇప్పుడు ప్రపంచం విలవిల్లాడిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రతీ ఒక్కరు ఆందోళన లోనే ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అందరూ కూడా భయపడి పోతున్నారు.

 

క్యాన్సర్ సహా పలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కోలుకున్న వాళ్లను కూడా ఈ వైరస్  బాగా ఇబ్బంది పెడుతుంది. ఇంత జరిగినా సరే చైనా బుద్ధి మాత్రం మారడం లేదు. అక్కడి ప్రజలు తమ తిండి లో ఎటువంటి మార్పులు చేసుకోవడం లేదు. కప్పలు, పాములు, ఎలుకలు, గబ్బిలాలు సహా అనేక రకాల కీటకాలను ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. అక్కడి ప్రభుత్వం వైరస్ కొనసాగిన మొదట్లో వారి ఆహార అలవాట్ల పై నిషేధం విధించింది. ఇప్పుడు మళ్లీ నిషేధం ఎత్తివేత వలన ఇష్టం వచ్చినట్టు తింటున్నారు.

 

కరోనా వైరస్ పాముల నుంచి, గబ్బిలాలు సహా అనేక రకాల కీటకా ల నుంచి వస్తుంది అనే వార్నింగ్ కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ వెకిలి తిండి తింటూ ఇప్పుడు ప్రపంచాన్ని మళ్లీ ఆందోళనలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు చైనాలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉంది. వేల మందికి ఈ వైరస్ సోకిన అక్కడి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి కరోనా వైరస్ ని పూర్తిగా కట్టడి చేసింది. దీంతో చైనీయులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. ఇప్పుడు మళ్లీ ఇష్టం వచ్చినట్టు తినడంతో ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: