తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా రెండో దశలో ఉంది. తెలంగాణలో దాదాపు 65 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 15 కేసులు నమోదయ్యాయి. ఇక్కడి ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నా సరే కరోనా ని మాత్రం ఇప్పుడు అడ్డుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. తెలంగాణలో విదేశీయులు ఎక్కువగా ఉన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా విశాఖ విమానాశ్రయం నుంచి భారీగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.

 

దీనితోనే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ప్రజలు మాత్రం  ఇంటికి వెళ్లడానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. దీనితో పరిస్థితులు ఎక్కడి వరకు వెళతాయి అనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం. ఇది గనుక మరింతగా విస్తరిస్తే జగన్ సర్కార్ కి కరోనా వైరస్ ను కట్టడి చేయడం అనేది సాధ్యం కాని విషయం.

 

కరోనా వైరస్ కేసుల విషయంలో జగన్ సర్కార్ ముందు నుంచి కాస్త అలసత్వం గానే ఉంది. అయితే తెలంగాణ మాత్రం ముందు నుంచి అప్రమత్తంగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ వైద్య పరీక్షలు చేయటం మొదలుపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులను మూసివేశారు. అయినా సరే కరోనా వైరస్ కాంటాక్ట్ ద్వారా రావడంతో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే ఇది మాత్రం అదుపులోకి వచ్చే అవకాశం కనబడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: