ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించింది. ఈ నేపథ్యంలో యావత్ భారత దేశంలో లాక్ డౌన్ విధించారు. అలాగే కరోనా బాధితులను ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకొచ్చి వారి సహృదయంతో విరాళాన్ని అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా విరాళాలు అందజేస్తుండటంతో ప్రధానమంత్రి మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వలన ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవటానికి, అలాగే భవిష్యత్ లో ఏదైనా విపత్కరమైన పరిస్థితులను అధిగమించడానికి జాతీయ నిధిని ఏర్పాటు చేశారు. పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌ ను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం.

 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రస్ట్‌ కు చైర్మన్‌ గా వ్యవహరిస్తారు. అలాగే ట్రస్ట్ సభ్యులుగా హోం మంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి ఇటివంటి వారు కొనసాగుతారు. ఈ ట్రస్ట్ పేరు పీఎం కేర్స్ ఫండ్ - ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెంట్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవటానికి అన్ని వర్గాల ప్రజలు వారి యొక్క సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు గాను పీఎం కేర్స్ ఫండ్‌ ను ఏర్పాటు చేశామని, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని ఏర్పరచుకోవటంలో ఈ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బ్యాంక్ పేరు స్టేట్ బ్యాంఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇది న్యూఢిల్లీ మెయిన్ బ్రాంచ్.

 

దీని యొక్క అకౌంట్ నెంబర్ 2121PM20202. ఐఎఫ్ఎస్‌సీ కోడ్ SBIN0000691, స్విఫ్ట్ కోడ్ SBININBB104. అందించే విరాళాలకు పన్ను మినహాయింపు కూడా ఉంది. ఈ విరాళాలను కంపెనీలు, సామాన్య ప్రజలు అందించొచ్చు. అలాగే దీనికి వెబ్‌ పైట్‌ కూడా ఉంది pmindia.gov.in అకౌంట్ పేరు వద్ద పీఎం కేర్స్ అని మెన్షన్ చేయాలి. అలాగే యూపీఐ ఐడీ కూడా ఉంది. pmcares@sbi కి యూపీఐ ద్వారా డబ్బు పంపొచ్చు. మీరు డొనేట్ చేసే మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపును పొందొచ్చు. ఈ ఫండ్ ను డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (భీమ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, మొబిక్విక్), ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి ఆప్షన్ల ద్వారా డబ్బును విరాళంగా పంపవచ్చు. పెద్ద మొత్తం కాకపోయినా మీకు చేతనైనంతగా సాయం చేయవచ్చని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: