తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఆరు కరోనా కొత్త కేసులు నమోదు కావడం తో పాటు ఒక కొత్త మరణం కూడా నమోదు అయ్యింది. మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో చనిపోయిన ఈ 74 ఏళ్ల వ్యక్తి ఢిల్లీ కి వెళ్లినట్లు ఓ ట్రావలింగ్ హిస్టరీ ఉందని తేలింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 66 కేసులు నమోదు కాగా, అందులోని పదిమందికి నయం కాగా ఒకరు మరణించారు.




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 కేసులు నమోదు కాగా ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య చూసుకుంటే కేవలం ఒకే ఒక గంటలోనే 1, 165 కొత్త కరోనా కేసులతో 6,15,970 కేసుల సంఖ్య నుండి కరోనా బాధితుల సంఖ్య 617,351 చేరుకుంది. కరోనా మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగి 28, 377 కి చేరుకుంది.





కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 71 జైలు లలో శిక్ష ని అనుభవిస్తున్న 11 వేల మంది నేరగాళ్లను విడుదల చేయాలని ఆ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేరళలో ఆరు కొత్త కేసులు నమోదు కాగా మొత్తం 165 మంది కరోనా వ్యాధి లక్షణాల కలిగి ఉన్నవారు చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటివరకు మన భారతదేశం మొత్తంలో 939 నమోదు కాగా... ఒకటి రెండు రోజుల్లో మన దేశంలో కూడా వెయ్యి మందికి పైగా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్ డౌన్ సాగుతున్నప్పటికీ... రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





ఈ క్రమంలోనే కొత్త ఆసుపత్రిలు, ఇంకా తదితర మెడికల్ సదుపాయాల కొనుగోలు కోసం PM-cares ఫండ్ ప్రారంభించారు. అయితే ఈ చారిటీ ఫండ్ ద్వారా పది రూపాయల నుండి కోట్లల్లో కూడా దానం చేయొచ్చు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఏకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు దానం చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. తాజాగా ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా రూ. 52 లక్షలు, ఐఏఎస్ అసోసియేషన్ సంస్థ వారు రూ. 21 లక్షలు దానం చేసారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: