ఏపీలో కరోనా కట్టడి కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతున్నందువల్ల వారిపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించింది. విదేశాల నుంచి వచ్చిన వారిని పకడ్బందీగా ట్రాకింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని వాలంటీర్ల ద్వారా గుర్తించి.. వారి వివరాలు ఉదయం, సాయంత్రం వాలంటీర్లు ట్రాక్ చేస్తున్నారు.

 

 

ఇక క్వారంటైన్లోలనూ, ఐసోలేషన్ వార్డుల్లోనూ ఉన్న విదేశీయుల ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి పది మందికీ ఓ వైద్యుడిని కేటాయంచి వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో భోజనం, వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

 

 

అంతే కాదు. 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడే వారికి ఏపీలోకి అనుమతి ఇస్తున్నారు. ఈ క్యాంపుల్లో కచ్చితంగా ఒక అధికారిని నియమిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో కలెక్టర్లతో కూడా ఈ అధికారి మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటున్నారు. అంతేకాదు.. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న కల్యాణ మండపాలు.. హోటళ్లను గుర్తించి శానిటైజ్‌ చేసి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

 

ప్రత్యేకించి విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. డాక్టర్లు, స్పెషలిస్టులు మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచడంపై కూడా దృష్టి పెడుతున్నారు. ఎవరికి లక్షణాలు కనిపించినా ఐసోలేషన్‌లో పెట్టాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: