రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, అటు ఏపీలో జగన్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని పిలుపు మేరకు 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి, ప్రజలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ, జాగ్రత్తలు, సూచనలు చెబుతున్నారు. ఇక సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పాత మిత్రులు ఒక చోటకు చేరారు. ఓ మీడియా డిబేట్ లో తెలంగాణకు చెందిన మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఏపీకి చెందిన ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు పాల్గొని, కరోనా వైరస్ ప్రభావంపై  మాట్లాడారు.

 

ఉమ్మడి ఏపీలో టీడీపీలో ఈ ఇద్దరు నేతలు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మంచి వాక్చాతుర్యం, సమస్యల పట్ల అవగాహన ఉన్న ఈ ఇద్దరు నేతల స్నేహం చాలాకాలం కొనసాగింది. అయితే ఏపీ, తెలంగాణలు విడిపోవడం, తర్వాత రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడంతో, ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది.

 

అయితే  ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య ఓ విషయంలో క్లాష్ కూడా వచ్చింది. పరిటాల శ్రీరామ్ పెళ్లికి వచ్చిన కేసీఆర్ తో పయ్యావుల క్లోజ్ గా ఉన్న నేపథ్యంలో రేవంత్ కొన్ని విమర్శలు చేసారు. ఇక ఆ విమర్శలని పయ్యావుల తిప్పికొట్టి, రేవంత్ పై ఆగ్రహాం వ్యక్తం చేసారు. అప్పుడు ఈ ఇద్దరు మధ్య గ్యాప్ మరింత పెరిగింది.

 

ఇక మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత  ఈ ఇద్దరు పాత మిత్రులు  మీడియా డిబేట్ లోకి వచ్చి, కరోనా వ్యాప్తి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేసారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: