ప్రస్తుతం కరోనా తెలుగు రాష్ట్రాలలో విజృంభిస్తుంది. రోజురోజుకి పెరుగుతున్న కేసులే దీనికి కారణం. ముఖ్యంగా గత మూడు రోజుల్లో కేసులు ఇంతకింతకు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈరోజు కర్నూలు జిల్లాలో మొదటి కేసు నమోదయింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. నేడు రాయలసీమలోని కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామంలో రాజస్తాన్ కు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.

 


దీనితో అధికారులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఈ సంఘటనతో నొస్సం గ్రామానికి 3 కిలోమీటర్లు చుట్టూ కరోనా జోన్ గా, అలాగే 7 కిలోమీటర్ల వరకు కరోనా బఫర్ జోన్ గా కర్నూల్ జిల్లా కలెక్టర్ అయిన వీర పాండియన్ ప్రకటించారు. నొస్సం చెందిన పాజిటివ్ వచ్చిన వ్యక్తి నొస్సం రైల్ వే స్టేషన్ లో గ్యాంగ్ మ్యాన్ గా పని చేస్తున్నారు. ఆ సదరు వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈయన గత పది రోజుల ముందు వారి సొంత ఉరికి వెళ్లి తిరిగి రావడం జరిగింది. ఈయన అక్కడినుంచి కర్నూల్ కి ట్రైన్ లో వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడినుంచి నొస్సం చేరడంతో ఇప్పుడు కర్నూల్ జిల్లా ప్రజలందరికి భయం మొదలయింది.

 

అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులకు కూడా కరోనా సోకింది. వారు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ ఐసోలేషన్ వార్డులో వారికి చికిత్స అందిస్తున్నారు. ఆ దంపతులకు సంబంధించిన కొడుకు, కోడలు, మనవరాలిని సైతం రిమ్స్ లోని క్వారంటైన్ వార్డ్ కు తరలించారు. ఇక్కడితో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 14 కేసుల్లో 12 కేసులు కేవలం పట్టణాల్లోనే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటివరకు టెస్ట్ చేసిన మొత్తం శాంపిల్స్ 457. ఇందులో పాజిటివ్ గా నమోదైన కేసుల సంఖ్య 14. అలాగే నెగిటివ్ కేసుల సంఖ్య 355 గా చేరింది. ఇంకా మీజిలీనా వాటికీ రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:  https://tinyurl.com/NIHWNgoogle

 

apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: