ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనాపై పోరాటం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతుగా సాయం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ వంతుగా భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ఈ విరాళాల వంతు ఇలా ఉంటే ప్ర‌ముఖ పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్ క‌రోనాపై పోరాటం చేసేందుకు భారీ విరాళం ఇచ్చింది. శ‌నివారం టాటా గ్రూప్ సంస్థ‌ల అధినేత ర‌త‌న్ టాటా ఈ విరాళం ప్ర‌క‌టించారు.

 

క‌రోనాపై పోరాటం చేసేందుకు టాటా ట్ర‌స్ట్ సంస్థ రు. 500 కోట్లు ఇచ్చింది. అలాగే కరోనావైరస్ సంక్షోభానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి సహాయంగా అదనంగా 1,000 కోట్ల రూపాయలు హామీ ఇచ్చింది. అంటే టాటాస్ సంస్థ మొత్తం రు. 1500 కోట్లు ప్ర‌క‌టించింది. ఈ సంస్థ గ‌తంలోనూ ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌కు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చింది. 

 

దేశంలో ఎక్క‌డ ఏ విప‌త్తులు సంభ‌వించినా టాటా సంస్థ ఎప్పుడూ ముందు ఉంటూ వ‌స్తోంది. మ‌న తెలుగు రాష్ట్రాల‌కు కూడా అనేక సంద‌ర్భాల్లో సాయం చేసింది. ఇక ఏపీలోని విజ‌య‌వాడ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సైతం వంద‌కు పైగా గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని టాటా సంస్థ అభివృద్ధి చేసిన సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా టాటా సంస్థ చేసిన ఈ సాయానికి దేశం అంతా ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రు కూడా ఆయ‌న‌కు పాదాభివందనం చేయాల్సిందే క‌దా..!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: