ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అయితే కరోనా మహమ్మారి ఇప్పటి వరకు విదేశీయుల నుంచే వచ్చిందని అంటున్నారు.  ఈ మద్య ఒకటీ రెండు లోకల్ గా కూడా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంద.. కంట్రోల్ చేయకుంటే మరింత ప్రమాదం జరిగే అవకావశం ఉందని అంటున్నారు.  గ్లోబల్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన తర్వాత వైద్యపరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. మృతిచెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థన చేసినట్టుగా తమకు సమాచారం ఉందని ఈటల చెప్పారు. తెలంగాణలో కరోనాతో 74ఏళ్ల వృద్ధుడు మృతిచెందినట్టు ఆయన తెలిపారు.    

 

భయం నిజమైంది.. తెలంగాణలో తొలి కరోనా మరణం.. పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి.. 65కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. మృతిచెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థన చేసినట్టుగా తమకు సమాచారం ఉందని శనివారం (మార్చి 28, 2020) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి భోజన కేంద్రాలు, వసతి ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

 

నిన్న ఒకేసారి 9 పాజిటివ్ కేసులు రావడంతో సీఎం కేసీఆర్ మరిన్ని చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పారని ఈటల వెల్లడించారు.  తెలంగాణలో కరోనా కేసులు 65కు చేరాయని ఈటల వెల్లడించారు.   ఢిల్లీ నుంచి వచ్చిన వృద్ధుడు అనారోగ్యంతో గ్లోబల్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ పాతబస్తీకి చెందిన వృద్ధుడు మృతిచెందినట్టు ఈటల వెల్లడించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: