కరోనా భారత్ పై విరుచుకుపడిన క్రమంలో భారత్ మొత్తం లాక్ డౌన్ ప్రకటించి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కరోనా భాదితులు ఎవరు ఉన్నారు, విదేశాల నుంచీ ఎంతమంది వచ్చారు అనే వివరాలు తెలుసుకుని అనుమానితులని క్వారంటైన్ కి తరలించి ప్రత్యేకంగా వైద్య చికిత్సలు అందిస్తూ కరోనా కట్టడికి ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ కాదా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా సమయం పడుతోంది..ఈ నేపధ్యంలోనే

IHG's first covid testing kit - The ...

భారత ప్రభుత్వం విదేశాల నుంచీ కరోనా టెస్ట్ కిట్స్ ని దిగుమతి చేసుకుంది. ఈ కిట్ ధర ఒక్కొక్కరి రూ. 4500 కాగా ఈ కిట్ ద్వారా కరోనా నిర్ధారణ సమయం దాదాపు 6 నుంచీ 7 గంటలు పడుతోంది. ఇటువంటి పరిస్థితులలో మన భారతీయ కంపెనీ ఒకటి అత్యంత తక్కువ ధరలోకి కరోనా టెస్ట్ కిట్ లని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఒక్కో కిట్ ధర కేవలం రూ. 1200 మాత్రమే. పైగా ఒక్కో కిట్ ద్వారా సుమారు 100 కరోనా టెస్ట్ లు చేసుకోవచ్చని తెలిపింది.

IHG's first covid testing kit - The ...

ఇదంతా బాగానే ఉంది కానీ ఈ కిట్ తయారి వెనుక ఎంతటి కష్టం దాగిఉందో తెలిస్తే “మినల్ ధకావే” అనే మహిలకి చేతులు ఎత్తి దణ్ణం పెడుతారు. ఎందుకంటే ఆమె 9 నెలల నిండు గర్భిణి. అదేంటి అనుకుంటున్నారా. అవును డెలివరీ కి వెళ్ళవలసిన ఆమె దేశం కోసం పనిచేయాల్సిన సమయం ఇదని నేరుగా తానూ తన టీం గడిచిన నెలరోజులుగా కష్టపడి తయారు చేస్తున్న కరోనా టెస్ట్ కిట్ కోసం లాబొరేటరీకి వెళ్ళింది. మొత్తం 10 తన టీమ్ సభ్యులతో అహర్నిశలు కష్టపడి ఆమె తయారు చేసిన ఈ కరోనా టెస్ట్ కిట్ కి భారత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ కిట్ లు ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రాంతాలకి ముందుగ పంపారు. త్వరలో భారత దేశం నలుమూలలా ఇవి అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: