కరోనా వైరస్ ప్రపంచాన్ని కాకా వికలం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు మొత్తం విలవిలలాడిపోతూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. ఈ వైరస్ కి మందు లేకపోవడంతో నివారణ చేపట్టడం కోసం ప్రజలను కట్టడి చేయటానికి ప్రధానులు, అధ్యక్షులు నానా తిప్పలు పడుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తే మీడియా కి చంద్రబాబు సీఎం గా లేకపోవడం తో విలవిలలాడిపోతూ ఉన్నారు అని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా చంద్రబాబు సీఎంగా ఉంటే దోమలపై దండయాత్ర మాదిరిగా కరోనా వైరస్ పై కత్తి సాము చేసిన చంద్రబాబు అనే ప్రోగ్రాములు కథలు కథలుగా కథనాలు మీడియాలో ప్రసారం చేసే వారిని ఏపీలో ఉన్న రాజకీయ నేతలు అంటున్నారు.

 

ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో వైరస్ ప్రబలకుండా వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. సాధారణంగా కరోనా వైరస్ దేశంలో వ్యాపిస్తున్న లెక్కలు బట్టి పరిస్థితిని బట్టి చూస్తుంటే విదేశాల నుండి వచ్చిన వాళ్లకు మాత్రమే ఈ వైరస్ ఉన్నట్లు ఎక్కువ శాతం తేలుతోంది. దీంతో దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో విదేశాల నుండి వచ్చిన వాళ్లను గుర్తించడంలో విఫలమవుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల సిస్టం ఉండటంతో ఎప్పటికప్పుడు రాష్ట్రానికి వచ్చిన విదేశీయులు డేటాని దగ్గర పెట్టుకుని సదరు వ్యక్తిని ఇంటి నుండి కదలకుండా జియో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ జగన్ ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్న పనితీరు దేశ స్థాయిలో హైలెట్ అవుతుంది.

 

ఇటువంటి పరిస్థితుల్లో బాబుని పొగిడే మీడియా ఎప్పుడు ఈ వైరస్ ప్రబలుతుంది అని ఎదురు చూస్తుంటే ...ఒకపక్క గ్రామ వాలంటీర్ ఉద్యోగస్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు cm గా ఉంటే కనుక బాబోరు మీడియా విరాళాల ప్ర‌క‌ట‌న ఇచ్చి తెగ దండుకునే వాళ్ళు. పాపం ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా లేకపోవడంతో సదరు మీడియా యజమానుల విలవిలలాడి పోతున్నారు అని ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. 




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: