కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవలు అందించేవారు మినహా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే కొందరు రాజకీయ నాయకులు ఇళ్లలోనే ఉండిపోయి ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తుండగా, మరికొందరు నేతలు బయటకొచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. అయితే  ఏపీలో చాలామంది ప్రజాప్రతినిధులు కరోనా దెబ్బకు భయపడి బయటకు రాకుండా ఉండిపోయినా, ఓ టీడీపీ  ప్రజాప్రతినిధి మాత్రం నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల కోసం పని చేస్తున్నారు.

 

వెస్ట్ గోదావరి పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నిత్యం తన నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. కరోనా ప్రభావం మొదలు కాగానే, ఆయన తన నియోజకవర్గ ప్రజలని అప్రమత్తం చేసారు. ఎప్పటికప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే, నియోజకవర్గంలో ప్రజలు ఎవరు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. అలాగే నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసారు.

 

అదేవిధంగా నియోజకవర్గంలో నీళ్ల సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పని చేయించుకుంటున్నారు. ఇక నియోజకవర్గంలో పారిశుధ్య సమస్యలు లేకుండా చూస్తున్నారు. ఇక తాజాగా అయితే లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో పేద ప్రజలకు తన వంతు సాయంలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణి చేసారు. మాస్క్ పెట్టుకుని మరి ఇంటింటికి తిరిగి పేదవారికి కూరగాయలు అందజేశారు.

 

ఇక ఎప్పటికప్పుడు బైక్ వేసుకుని , ఒక్కరే నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. అయితే ఓ వైపు కరోనా వ్యాప్తి చెందకుండా పోరాటం చేస్తుంటే, మరోవైపు నియోజకవర్గంలో రైతుల సమస్యల పైన కూడా పోరాటం చేస్తున్నారు. చాలాచోట్ల వరి పొలాలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచారు. ప్రభుత్వం స్పందించి నీరు అందించాలని పలుమార్లు పొలం గట్లపైనే నిరసనలు తెలియజేసారు. మొత్తానికైతే నిమ్మల రామానాయుడు కష్టకాలంలో ప్రజల్ని ఆదుకోవడంలో ముందున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: