ప్రపంచాన్ని కబళిస్తున్న పేరు కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు యూరప్ మరియు అగ్రరాజ్యం అమెరికా దేశాలను అతలాకుతలం చేస్తోంది. అమెరికాలో పాజిటివ్ కేసులు దాదాపు లక్షకుపైగా నమోదు అయ్యాయి. త్వరలో అమెరికాలో చైనా మరియు ఇటలీ కంటే ఎక్కువ మరణాల సంఖ్య నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై షట్ డౌన్ చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తోంది. అలా చేస్తే అమెరికా దేశం లో ఆత్మహత్యలు ఎక్కువై పోతాయని, ఆర్థిక మాన్యం పూర్తిగా దెబ్బతింటుందని, కోలుకునే పరిస్థితి ఉండదని అంటూ దేశ వ్యాప్తంగా భారీ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది.

 

అంతేకాకుండా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించారు. ఇదిలా ఉండగా భారతదేశంలో కూడా ఏప్రిల్ 14 వరకు షట్ డౌన్ అని కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. దీంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కేవలం నిత్యావసర సరుకుల కోసం మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన టైంలో బయటకు వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు కట్టుదిట్టంగా ఉన్నాయి. ముఖ్యంగా విదేశీయుల నుండి వైరస్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు ఎవరూ కూడా తమ గ్రామాల లోకి కొత్తవాళ్లని రానివ్వడం లేదు.  డాక్టర్లు మరియు ముళ్ళ కంపలు అదేవిధంగా సిమెంట్ రాళ్లను గ్రామ పొలిమేర దగ్గర అడ్డం పెట్టి ఎక్కడికక్కడ భయం భయంగా బతుకుతున్నారు. ఇలా ఉండగా ఉత్తరాంధ్రలో ప్రశాంతతకు నిలయము ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు విదేశీయులు కనబడటంతో ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు శ్రీకాకుళం వాసులు.

 

ఇరాక్ దేశానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు శ్రీకాకుళం రోడ్లపై కనబడటంతో ఒక్కసారిగా శ్రీకాకుళం ప్రజలలో ఆందోళనలు నెలకొన్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో...వెంటనే పోలీసులు వచ్చి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసుకున్న వాళ్లు.. తాము ఇరాక్ దేశానికి చెందిన వాళ్లమని చెప్పుకున్నారు. శ్రీకాకుళానికి దగ్గర్లో ఉన్న ఓ కాలేజీలో ఎం.ఫార్మసీ చేస్తున్నామని, పట్టణంలోనే ఓ కాలనీలో ఉంటున్నామని చెప్పారు. నిత్యావసర సరుకుల కోసం వచ్చామని ఎప్పటినుండో శ్రీకాకుళంలోని ఉంటున్నామని చెప్పుకొచ్చారు. దీంతో శ్రీకాకుళం వాసులు అంతా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. 




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: