ప్రపంచ వ్యాప్తం గా కరోనా భయం పట్టుకుంది... కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యం లో ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటారు.. జనతా కర్ఫ్యూ ను విధించారు.. అందులో భాగంగా లాక్ డౌన్ ను ఏర్పాటు చేశారు.. ప్రజలు ఎక్కడ బయట తిరిగిన కూడా పోలీసులు వదలడం లేదు.. దొరికిన వారిని దొరికినట్లు ఉతికేస్తున్నరు...

 

 

 

ఇలాంటి సమయం లో అను కోని రీతిలో ఓ హత్య వెలుగులోకి వచ్చింది... వివరాల్లోకి వెళితే.. 
ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈస్ట్ ముంబైలోని కండివ్లీ ప్రాంతానికి చెందిన దుర్గషే ఠాకూర్, రాజేష్ ఠాకూర్ అన్నదమ్ములు. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లోకి అవసరమైన సరుకులు కొనుక్కొచ్చేందుకు తన భార్యతో కలసి బయటకు వెళ్తున్నట్లు తమ్ముడు రాజేష్ అన్నికి చెప్పాడు.

 

 

 


బయటకు వెళ్లడానికి అన్న ససేమిరా అన్నాడు.. కానీ అన్న మాట వినకుండా బయటకు వదినతో కలిసి బయటకు వెళ్ళాడు.. లాక్‌డౌన్ అమల్లో ఉందని.. బయటకు వెళ్లొద్దని సూచించాడు. అయినా ఇప్పుడు అంత అవసరం ఏముందని ప్రశ్నించాడు. అన్న ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలంటూ తమ్ముడు, అతని భార్య బజారుకి వెళ్లారు. బయటకి వెళ్లొద్దని చెబుతున్నా వెళ్లడం అన్న దుర్గేష్‌కి ఆగ్రహం తెప్పించింది.

 

 

 

మాటా మాటా పెరిగి అడ్డుగా వచ్చిన భార్యను చెంప మీద కొట్టారు.. అడ్డొచ్చిన తమ్ముడిని కత్తితో దాడి చేశాడు. ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తీసుకుని పొడిచేయడంతో రాజేష్ అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం అతనిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని నిందితుడు దుర్గేష్‌ని అదుపులోకి తీసుకున్నారు. కారోనా కారణంగా హత్యలు జరిగిన తప్పులేదు...

మరింత సమాచారం తెలుసుకోండి: