ఏపీ ఇప్పుడు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కుంటోంది. జగన్ పరిపాలన పరంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయినా పై చేయి నాదే అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. జగన్ విషయంలో జగన్ చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కుంటూ ముందుకు వెళ్తుండడంతో పాటు కోర్టుల్లో మొట్టి కాయలు తినడం, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరించడం వంటి విషయాల కారణంగా జగన్ తరచుగా విమర్శలు ఎదుర్కుంటున్నారు. జగన్ ఏపీ బడ్జెట్ ను మించిపోయే స్థాయిలో కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నాడు. అయినా ఇంకా ఆ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలంటే లక్షల కోట్లు కావలి. అయితే విభజన కష్టాల్లో ఉన్న ఏపీ ఆరేళ్ళుగా నానా రకాలైన ఇబ్బందులను చవి చూస్తూ వస్తోంది. 

 

IHG

ఏపీ ప్రభుత్వ ఆదాయం కూడా బాగా తగ్గిపోయింది. అసలు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం షాపులను చాలా వరకు జగన్ తగ్గించేశారు. ఇప్పుడు ఆ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వానికి కావాల్సిన నిధులు కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ వారి దయాదాక్షిణ్యాల కోసం జాలిగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగవుతోంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కరోనా వైరస్ ప్రభావం వచ్చిపడడంతో జగన్ ఆశలు ఒక్కసారిగా అడియాసలయ్యాయి. కేంద్రం ఆదేశాలతో 
ఏపీని లాక్ డౌన్ చేశారు. 


అంతంతమాత్రంగా ఉన్న ఏపీ ఆదాయం కాస్తా ఇప్పుడు పూర్తిగా పాతాళానికి పడిపోయింది. ఏపీ సీఎంగా గత ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పదవి నుంచి దిగిపోయే సమయానికి మూడు లక్షల కోట్ల అప్పుని ఏపీకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన జగన్ ఉన్న ఆదాయానికి గండికొట్టేలా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యపాన నిషేధం విధించడంతో ఏపీ ఆదాయం అమాంతం పడిపోయింది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఢమాల్ మంటూ పడిపోవడంతో ఒక్కసారిగా నిర్మాణ రంగం కుదేలు అయింది. స్టాంపులు, రిజిస్టేషన్ రంగాలు కూడాఇవే పరిస్థితుల్లో ఉన్నాయి. వాణిజ్య పన్నుల రంగం ఆదాయం సైతం బాగా పడిపోయింది.


 ఇంకో వైపు జగన్ ఇచ్చిన హామీల మేరకు ఖజానాకు ఆర్ధిక భారం బాగా పెరిగింది. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం మరింత పడిపోవడంతో పాటు ప్రజలకు ఇప్పుడు కావాల్సిన నిత్రవాసరాలు, సొమ్ములను ప్రభుత్వమే సమకూర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా జగన్ కు మింగుడుపడని అంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: