కరోనా మహమ్మారి రెండు తెలుగు రాష్ట్రాలని వణికిస్తుంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ కొనసాగుతున్న కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో, ఆ లోపు ఎన్ని కరోనా కేసులు వస్తాయనే భయం పెరుగుతుంది. ప్రస్తుతానికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 16 కు చేరుకున్నాయి.

 

అయితే  ఏపీలో కొన్ని లెక్క‌లు అంద‌రికి షాక్ ఇస్తున్నాయి. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 29, 464 మంది విదేశాల నుంచి వ‌చ్చారు. వీరిలో చాలా మందిని ప్ర‌భుత్వం త‌ర‌పున‌ క్వారంటైన్ చేశారు. ఇక వీరిని 14 రోజుల తరువాత మళ్ళీ పరీక్షచేసే అవకాశముంది.  ఇక వీరిలో ఇంకా ఎంతమందికి కరోనా పాజిటివ్ తేలుతుందో అర్ధం  కాకుండా ఉంది. అంటే లాక్ డౌన్ పూర్తయ్యే లోపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎంతవరకు వెళుతుందో చూడాలి.

 

ఇక అటు తెలంగాణాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తెలంగాణలో శనివారం ఒక్కరోజే 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 68 కరోనా పాజిటివ్‌ కేసులుగా నిర్ధారించారు. పాతబస్తీలో ఒకే కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారు.

 

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో  74 ఏళ్ల వృద్ధుడు చనిపోగా, చనిపోయాక కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో  చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. మరి వీరిలో ఎంతమందికి కరోనా పాజిటివ్ వస్తుందో రెండు రోజుల్లో తేలనుంది.

 

అయితే లాక్ డౌన్ పూర్తయ్యే లోపు తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 200 పైనే చేరుకుంటుందని అంటున్నారు. ఇక ఆ తర్వాత కూడా కరోనా కేసులు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తే అంత మంచిది. మరి చూడాలి లాక్ డౌన్ పూర్తయ్యే లోపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కరోనా కేసులు తేలుతాయో.   

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: