ప్రపంచ వ్యాప్తంగా ఒకటే సమస్య మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. అదే కరోనా మహమ్మారి వైరస్..  ఈ కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది మృత్యు ఒడిలోకి చేరారు . అందుకే  ప్రజలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని కరోనా వైరస్ మనుషుల నుంచి వ్యాపిస్తుందని వీలైనంత వరకు వారిని చేతులతో ముట్టుకోరాదని సూచిస్తున్నారు.ఆల్కహాల్ ఉన్న శానిటైజర్స్ ను వాడుతూ చుట్టూ పక్కల శుభ్రాంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. 

 

 

 

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జనతా కర్ఫ్యూ పేరుతో  ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ కర్ఫ్యులో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అంతేకాకుండా కరోనా ప్రభావం మరింత పెరుగుతుండటంతో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది.  లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత జన సంచారం పూర్తిగా మాయమయ్యారేమో అని తెలుస్తుంది.. 

 

 


కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కూడా దాని ప్రభావం ఎక్కడా తగ్గలేదు.. పెరుగుతూనే వస్తుంది . ఇప్పటికే తెలంగాణను కుదిపేసిన ఈ కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..ప్రేమ అనుబంధాలకు ... రక్త సంబంధాలు అన్నీ దూరమై బ్రతికున్న విగత జీవులుగా మారారు .. అలాంటి ఈ ప్రపంచం ఒకటే మాటా అంటుంది.. కరోనా నుంచి కాపాడు అని.. అయిన ఈ కరోనా ప్రభావం ఒంటి కాలిపై ముంచుకొస్తుంది... 

 

 

 

ఇకపోతే ఆంధ్ర తో పోలిస్తే తెలంగాణ లో కరోనా ప్రభావం ఎక్కువ గా ఉందని తెలుస్తుంది.. ప్రజలపై పంజా విసురుతోంది.. తెలంగాణలో నిజామాబాద్ లో మరో కరోనా కేసు కలకలం సృష్టిస్తోంది.. నిజామాబాద్ లో ఓ కరోనా కేసు భయ పెడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వృద్దుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిపారు.. అతన్ని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ వైద్యులు అతనికి చికిత్స ను అందించారు .. మరి కొన్ని పాజిటివ్ కేసులు ఉన్నట్లు వెల్లడి..

మరింత సమాచారం తెలుసుకోండి: