లాక్ డౌన్ నేపధ్యం లో మందుబాబుల కష్టాలు అన్ని, ఇన్ని కావు . మద్యం దుకాణాలు , బార్ షాప్ లు మూసివేయడం తో నిత్యం మందు సేవించే అలవాటున్న వారు మతిస్థిమితం లేని వారిమాదిరిగా ప్రవర్తిస్తున్నారు . కొంతమంది ఆత్మహత్య యత్నాన్ని చేసుకోక , ఒక వ్యక్తి ఏకంగా మందు దొరకడం లేదని ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . జీడిమెట్ల పారిశ్రామిక వాడ లో నివసించే శ్రీను ఈ నెల 25  వతేదీన మద్యం కోసం అన్ని చోట్ల తిరిగాడు . చివరిగా మద్యం కోసం భార్య తో కలిసి  స్థానిక ఎన్టీఆర్ నగర్ కు వెళ్లిన శ్రీను అక్కడి నుంచి కన్పించకుండా పోయాడు .

 

శ్రీను కన్పించడం లేదని కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా , మిస్సింగ్  కేసు నమోదు కేసుని గాలింపు చేపట్టారు . ఐడిపిఎల్ అటవీ ప్రాంతం లో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి పోసుకుని ఉండడాన్ని గుర్తించిన కొంతమంది పోలీసులకు సమాచారం అందించగా , పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  శవాన్ని స్వాధీనం చేసుకున్నారు . ఆ శవం శ్రీనుదిగా అతడి  కుటుంబ సభ్యులు గుర్తించారు . కేవలం మద్యం దొరకలేదన్న కారణంగానే శ్రీను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు విచారణ లో తేలింది . లాక్ డౌన్   నేపధ్యం లో    రాష్ట్ర ప్రభుత్వం   మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే .

 

దీనితో బెల్ట్ షాపుల్లో కూడా నిల్వలు లేకపోవడంతో మందుబాబులకు ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి . దీనితో చేసేది లేక కొంతమంది వైన్ షాప్ లలో దొంగతనానికి కూడా పాల్పడేందుకు రెడీ అయ్యారు . హైదరాబాద్ లోని ఒక వైన్ షాప్ లో ఇదే తరహా లో దొంగతనానికి పాల్పడే యత్నం చేయడం తో , వైన్ షాప్ లకు రక్షణ కల్పించాలని వైన్స్ యజమానులు సంఘం పోలీసుల్ని కోరింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: