ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల పరిస్థితిని తలకిందులు చేసేసిన కరోనా వైరస్ గురించి మాట్లాడుకోని మానవుడు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. గత రెండు నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి వైరస్ మొట్టమొదటిసారి చైనాలోని వుహాన్ నగరంలో వచ్చిన విషయం తెలిసిందే. మధ్య చైనాలోని ప్రధాన నగరమైన వుహాన్ లో జనాభా చాలా ఎక్కువ. అదీ కాకుండా బాగా అభివృద్ధి చెందిన నగరం వల్ల అనేకమంది ఇతర దేశాలకు తరలి వెళ్లడంతో ప్రపంచం మొత్తం వైరస్ వ్యాపించింది. రోజుకి వేలాది ప్రాణాలను బలి తీసుకుంటోంది.

 

అయితే సరిగ్గా చైనాలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడే వైరస్ బయటకు రావడంతో మొదటినుండి దేశంపై అందరికీ రకరకాల అనుమానాలు ఉన్నాయి. చైనా దేశమే కావాలని వైరస్ ను తయారు చేసి ప్రపంచం మీదకు వదిలింది అని అంతా అంటున్నారు. అయితే వుహాన్ నగరంలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ లో చాలా కాలంగా సార్స్ మరియు మెర్స్ వైరస్ లకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి కలయికే కరోనా.

 

మొట్టమొదటిసారి కరోనా బయట పడిన ప్రదేశంగా భావిస్తున్న సీ ఫుడ్ తయారుచేసే తీరప్రాంతం ల్యాబ్ కు కేవలం 20 మైళ్ళ దూరంలో ఉంది. కాబట్టి చైనీయులు కావాలనే వైరస్ ను తయారుచేసి ప్రపంచం మీదకి వదిలినట్లు మరియు కొద్ది రోజుల తర్వాత దాని నుండి బయట పడేందుకు వ్యాక్సిన్ కూడా ముందుగానే తయారు చేసి పెట్టుకున్నట్లు అంతా చెబుతున్నారు. చైనాపై ఇంత బలమైన ఆరోపణలు చేయడానికి వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటంటే...

 

ఉత్తర కొరియా, రష్యా, చైనా దేశాలు చాలా మంచి స్నేహితులు. అయితే కొరియా మరియు రష్యాకు అమెరికన్లు విరోధులు కాబట్టి చైనా కూడా అమెరికా శత్రువు. ఇకపోతే చాలా విచిత్రంగా చైనా కి దగ్గర ఉండే కొరియా దేశానికి ఎటువంటి వైరస్ ఎఫెక్ట్ పడకపోగా రష్యాలో 500 పాజిటివ్ కేసులు నమోదైనా ఒక్కరు కూడా చావలేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రష్యా ఒకటి కావడం గమనార్హం. అదీ కాక చైనా కేవలం రెండు నెలల్లోనే చాలా అనూహ్యంగా వైరస్ నుండి కోలుకోవంతో వైరస్ ను ట్రీట్ చేసే వ్యాక్సిన్ తమ వద్ద పెట్టుకుని తమకు నచ్చిన వారికి రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: