ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ రాకాసిలా విజృంభిస్తోంది. క్ష‌ణంక్ష‌ణానికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. ఇక చైనాలోని వుహాన్‌లో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే ఇప్పుడు ఈ వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ విస్త‌రిస్తోంది. ఇట‌లీలో అయితే మ‌ర‌ణ మృదంగం మోగుతోంది. నిన్న ఒక్క రోజే అక్క‌డ ఏకంగా 900 మంది చ‌నిపోయారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ వైర‌స్ దెబ్బ‌తో 30 వేల మంది చ‌నిపోతే అందులో ఒక్క ఇట‌లీలోనే ఏకంగా 10 వేల మంది చ‌నిపోయారు. ఇట‌లీలో ఏకంగా ల‌క్ష మంది క‌రోనా పాజిటివ్ బాధితులు ఉన్నారు.

 

ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలో అయితే శ‌వాల దిబ్బ‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ వైర‌స్‌కు కార‌ణ‌మైన చైనాపై ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చైనాయే ఈ బ‌యో వైర‌స్ స్టార్ట్ చేసి ప్ర‌పంచాన్ని... ముఖ్యంగా త‌న‌కు పోటీగా ఉన్న దేశాల‌ను దెబ్బ‌తీసేందుకు బయో వార్‌కు తెర‌లేపింద‌న్న ఆరోప‌ణ‌లే ఎక్కువుగా ఉన్నాయి. ప్ర‌పంచంలో చైనాకు పోటీగా వ‌స్తోన్న దేశాల విష‌యంలో కొద్ది రోజులుగా డ్రాగ‌న్ కోర‌లు చాస్తూ వాళ్ల‌ను అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే చైనాకు ఆసియాలో పోటీగా ఉన్న భార‌త్‌ను భూ, వాయు.. జ‌ల‌మార్గాల్లో దిగ్బంధ‌నం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 

 

ఇక అగ్ర రాజ్య‌మైన అమెరికాను అన్ని విధాలా దెబ్బ తీసే క్ర‌మంలో కూడా చైనా ఈ బ‌యోవార్‌కు తెర‌లేపింద‌న్న సందేహాలు ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌స్తున్నాయి. అమెరికా ఆర్థిక‌, ఆరోగ్య ప‌రంగా ముందు ఉంది.. ఈ క్ర‌మంలోనే ట్రంప్ చెప్పిన‌ట్టు చైనా అమెరికాతో పాటు ఆర్థికంగాను.. అభివృద్ధి ప‌రంగాను ముందు ఉన్న జీ 20 దేశాల‌ను చైనా టార్గెట్ చేస్తోందంటున్నారు. కేవ‌లం అమెరికా మాత్ర‌మే కాదు ఇటు ఆసియాలో భార‌త్తో పాటు అటు ఉత్త‌ర అమెరికా ఖండంలో దేశాలు... ఇటు యూర‌ప్ ఖండంలో ఉన్న అభివృద్ధి చెందుతోన్న దేశాల వ్య‌వ‌స్థ‌ల‌ను కుప్ప‌కూల్చేందుకే చైనా ఈ కుట్ర‌కు తెర‌లేపింద‌న్న సందేహాలు ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: