తెలంగాణ‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 14 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం పెరుగుతోంది. ప్ర‌ధానంగా ఇక్క‌డ అంత‌ర్జాతీయ ఎయిర్ పోర్టు ఉండ‌డంతో పాటు అంత‌రాష్ట్ర స‌రిహ‌ద్దులు కూడా ఎక్కువుగా ఉండ‌డ‌మే కార‌ణం. ప్రధానంగా అంతర్జాతీయ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనే కేసులు వెలుగు చూస్తున్నాయి. 

 

ఇతర దేశాలకు, ఉత్తర భారత దేశానికి వెళ్లి వ‌స్తోన్న వారితోనే ఈవైర‌స్ ప్ర‌ధానంగా ఇక్క‌డ వ్యాప్తి చెందుతోంది. అయితే స్థానికంగా ఉన్న వాళ్ల ద్వారా ఇది పెద్ద‌గా వ్యాప్తి చెంద‌క‌పోయినా ఇత‌ర ప్ర‌దేశాల నుంచి వ‌చ్చిన వారితోనే ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. విదేశాల నుంచి వ‌చ్చిన వారికి ఈ వ్యాధి 14 రోజుల‌కు గాని బ‌య‌ట ప‌డ‌డం లేదు. మ‌రి కొంద‌రికి మ‌రింత స‌మ‌యం తీసుకుంటోంది. ఈ లోప‌లే వారు వారి కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో, బయటి ప్రదేశాల్లోని జనంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇలా ప‌రిస్థితి ఇక్క‌డ అదుపు  త‌ప్పేలా ఉంది.

 

ఇలా ఈ వైర‌స్ అంద‌రికి వ్యాప్తి చెందుతోంది. హైదరాబాద్‌, కరీంనగర్‌, భద్రాద్రి-కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి.. ఈ 5 జిల్లాలోనే కరోనా కేసులు బయటపడ్డాయి. మిగతా జిల్లాల్లో ఒక్క కేసు కూడా బయటప డలేదు. దీనిని బ‌ట్టి చూస్తుంటే ఈ ఐదు జిల్లాల‌పైనే ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఎయిర్‌పోర్టు ద్వారా వ‌స్తోన్న వారితో ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌డంతో ఇప్పటికే శంషాబాద్‌, కోకాపేట తదితర ప్రాంతాల్లోని దాదాపు 2,400 మందిని హోం క్వారంటైన్‌ చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: