భారత్‌లో కరోనా కేసులకు ఆ దేశమే కారణమా అంటే కారణం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ నగరంలో అయినప్పటికీ మన దేశానికి కరోనా వైరస్ వచ్చింది మాత్రం దుబాయ్ నుండే. అయితే ఇప్పటికి అక్కడక్కడా కేసులు కనిపిస్తున్నప్పటికీ ఈ వైరస్ మన దేశంలో కూడా విజృంభించాడానికి ప్రయత్నిస్తుంది. 

 

అయితే మన దేశ ప్రభుత్వం అన్ని దేశాలను చూసి ఇది చాలా డేంజరస్ వైరస్ అని తెలుసుకొని ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల దేశం కాస్త కరోనా బారి నుండి బయటపడింది. ఇక పోతే ఈ కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు భారతీయులందరికి కూడా ఏప్రిల్ 14వ తేదీ వరుకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా దేశ ప్రజలు అంత కూడా ఇళ్లకే పరిమితం అవ్వాలి. అప్పుడే ఈ కరోనా భారీ నుండి బయటపడగలం.

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ దుబాయ్ నుండే మన దేశానికి వచ్చింది అని ఒక అధ్యయనం పేర్కొంది. భారత్ లో ఎక్కువ కేసులు దుబాయ్ నుంచి వచ్చిన వారేనని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేతలో ఆలస్యం కావడం వల్లే కరోనా వైరస్ ఇలా భారత్ లోను విజృంభించింది అని ఆ అధ్యయనంలో తేలింది. 

 

కాగా ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 30వేలమందికిపైగా మృతి చెందారు. చైనా తరవాత.. అమెరికా, ఇరాన్, ఇటలీలో కరోనా మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇంకా 6లక్షలమందికి పైగా ప్రజలు ఈ కరోనా భారిన పడ్డారు.. ఇంకా మన భారత్ లో కూడా ఇప్పటికి 1029 కేసులు నమోదు అయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి.. అందులోను 24మంది చనిపోయారు.. 85 మంది ఈ కరోనా వైరస్ బారి నుండి కోలుకున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: