కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు అన్నీ కుస్తీ పడుతున్నాయి. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ అన్ని రకాలుగా నష్టాన్ని చేకూరుస్తుంది ఈ వైరస్. ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దీనికి మందు ఏమి కనిపెట్టకపోవడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే పరిష్కారంగా భావిస్తూ ప్రపంచ దేశాలన్నీ ముందుకు కదులుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి సులభంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో దీని నివారణకు ఎవరూ రోడ్లపకి రాకుండా నిరోధించడమే ఏకైక మార్గంగా లాక్ డౌన్ ను ప్రపంచ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ అక్కడ విలయతాండవం చేసింది. అయితే కొద్ది రోజుల్లోనే ఆ వైరస్ ప్రభావాన్ని పూర్తిగా చైనా నివారించగలిగింది. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> deaths top 1,000 as country steps <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=UTTAR PRADESH' target='_blank' title='up-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>up</a> testing

ప్రస్తుతం చైనాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. కానీ అప్పటికే చైనా ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ ఈ వైరస్ విస్తరించి అపార నష్టాన్ని చేకూరుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అన్ని దేశాల కంటే ఎక్కువగా బ్రిటన్, అమెరికా వంటి దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం కరోనా వైరస్ బారిన పడి 27 వేల మందికి పైగా మరణించగా, ఆరు లక్షల మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వైరస్ ప్రభావం బ్రిటన్ లోనూ ఎక్కువగా ఉంది.

 


 ఏకంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రిన్స్ చార్ల్స్ కూడా ఈ కరోనా వైరస్ సోకడంతో అతను కూడా భతిథుడిగా మారిపోయి, క్వారంటైన్ కు వెళ్ళిపోయాడు. పరిస్థితి అదుపుతప్పుతున్నట్టుగా కనిపిస్తుండడంతున్న నేపథ్యంలో ఈ వైరస్ ను పూర్తిగా అదుపు చేసేందుకు బ్రిటన్ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ ను బ్రిటన్ మొత్తం కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించేందుకు కూడా అధికారులు ఆలోచన చేస్తున్నారు. బ్రిటన్ వ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగించేందుకు కసరత్తు చేస్తూ ఈ మేరకు ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉండాలని ప్రకటించడంతో అక్కడి ప్రజల్లో మరింత ఆందోళన రేకెత్తుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: