2014 అసెంబ్లీ ఎన్నికల ముందు యామినిబాల ఎవరో శింగనమల నియోజక వర్గ ప్రజలకు పెద్దగా తెలియదు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శమంతకమణి కుమార్తెగా కొంతమందికి ఆమె పరిచయం ఉన్నా ప్రజల్లో ఆమెకు ఎటువంటి గుర్తింపు లేదు. ఆమె పరిచయం ఉన్న కొంతమందికి కూడా ఒక సాధారణ టీచర్ గానే తెలుసు. ఆమె అదృష్టం కొద్దీ 2014లో అనుకోకుండా టీడీపీ తరపున శింగనమల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చింది. 


 
ఎన్నికల్లో పోటీ చేయడం ఆమెకు ఇష్టం లేకపోయినా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ప్రభుత్వ విప్ హోదా కూడా పొందారు. 2014 ఎన్నికల్లో సులభంగానే విజయం సాధించిన యామినికి 2019 ఎన్నికల్లో శింగనమల టికెట్ దక్కలేదు. కొందరు రాజకీయనేతల జోక్యం వల్లే ఆమెకు టీడీపీ టికెట్ దక్కలేదని ప్రచారం జరిగింది. 


 
యామినిబాల ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు మండల విద్యాధికారిగా కూడా పని చేశారు. 1989లో శింగనమల నుండి తొలిసారిగా కాంగ్రెస్ తరపున పి శమంతకమణి పోటీ చేసి ఎన్నికై నాడు మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో పని చేశారు. ఆ తరువాత వీరి కుటుంబం టీడీపీలో చేరింది. శమంతమణి కోరడంతో 2014లో యామినిబాలకు టీడీపీ టికెట్ దక్కింది. 2014లో 4584 ఓట్ల ఆధిక్యతతో జొన్నలగడ్డ పద్మావతిపై యామినిబాల గెలిచారు. 


 
విద్యావంతురాలు కావడం, నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీలతో యామినిబాల ఎమ్మెలెయిగా ఎన్నికైంది. కేవలం టీచరమ్మగా మాత్రమే పేరు ఉన్న యామినిబాల టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచి విజేత అయ్యారు. రాజకీయ కుటుంబానికి చెందిన కుటుంబం నుంచి వచ్చినా యామిని బాలకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం నియోజకవర్గంలో యామిని బాల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 
 


శింగనమల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె ఎంతో కృషి చేశారు.2019లో కొందరి రాజకీయ కుట్రల వల్ల ఎమ్మెల్యే టికెట్ ఆమెకు దక్కలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా నియోజకవర్గ అభివృద్ధికోసం యామినిబాల ఎంతగానో కృషి చేస్తున్నారు. రెండు వారాల క్రితం యామిని బాల తన తల్లితో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఆమె పార్టీ మారారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: