ఏపీలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్న విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నా నిన్న ఒక్కరోజే ఆరు కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ వల్ల పేద, మధ్య మధ్య తరగతి ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా నేపథ్యంలో సీఎం జగన్ ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. 
 
ఏపీ ప్రభుత్వం మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ జారీ అయిన తరువాత ఏపీ ప్రభుత్వం మొదట పెన్షన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ నిన్న సాయంత్రం ఏప్రిల్ 1న ఇళ్ల వద్దనే పెన్షన్ మొత్తాలను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
సీఎం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని... వారు ఎట్టి పరిస్థితుల్లోను ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 1000 రూపాయలు పంపిణీ చేసేలా జగన్ ఆదేశించారు. 
 
గ్రామ వాలంటీర్లు అర్హులైన వారికి నగదును అందజేయనున్నారు. ఈరోజు నుంచి ఉచితంగా బియ్యం, కందిపప్పు రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ 15న, ఏప్రిల్ 29న మరోసారి ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో పేద ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: