ప్ర‌పంచ మ‌హ‌మ్మారి కరోనా వైరస్‌ కారణంగా కండోమ్‌ల తయారీకి బ్రేక్‌ పడింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు చాలా మంది క‌రోనా దెబ్బ‌తో శృంగారానికి సైతం దూర‌మ‌వ్వాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక కండోమ్‌ల త‌యారీకి ప్ర‌పంచ వ్యాప్తంగా మలేషియాకు చెందిన కారెక్స్‌ బీహెచ్‌డీ అనే సంస్థ ప్ర‌సిద్ధి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎంతో మంది కొన్ని కోట్ల కండోమ్‌లు ఉప‌యోగిస్తూ ఉంటారు. ఎవ‌రు ఎన్ని కండోమ్‌లు వాడినా వీట‌న్నింటిలో ప్ర‌తి ఐదు కండోమ్‌ల‌లో ఒక కండోమ్ ఈ సంస్థే త‌యారు చేస్తుంది. అంత‌గా ఈ సంస్థ కండోమ్‌ల త‌యారీకి ప్ర‌సిద్ధి.

 

ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు వారాలుగా ఈ సంస్థ మలేషియాలోని మూడు ప్రధాన ఫ్యాక్టరీల్లో ఒక్కటి కూడా తయారుచేయలేదు. ఫలితంగా దాదాపు కోటి కండోమ్‌ల తయారీ, సరఫరా ఆగిపోయింది. ఇక ఈ సంస్థ త‌యారు చేసే కండోమ్‌లు డ్యూరెక్స్ లాంటి ప్ర‌పంచ స్థాయి సంస్థ‌లు అనేక దేశాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంటాయి. ఈ కండోమ్‌ల‌కు ఎంత క్రేజ్ ఉంటుందంటే బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య సేవల కేంద్రం, ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సైతం వీటిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంటాయి. 

 

ఇక ఇప్పుడు వీటిని త‌యారు చేసేందుకు సిబ్బంది కూడా రావ‌డం లేదు. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా కండోమ్‌ల కొర‌త ఆడిపోయింది. ఇదే కొర‌త కొన్ని నెల‌ల పాటు కంటిన్యూ అవుతుంద‌ని అంటున్నారు. ఇక ఈ కండోమ్‌లు తగిన సంఖ్యలో సరఫరా కాకపోతే ప్రపంచ దేశాల్లో- ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలుత్పన్నం కాగలవని హెచ్చరిస్తున్నారు.  ఇక చైనాలోనూ.. ఇటు కొరియా లాంటి చోట్ల ఇప్ప‌టికే శృంగార ప్రియులు క‌రోనా దెబ్బ‌తో పిచ్చెక్కిపోతున్నారు. దీనికి దూరంగా ఉండ‌లేక‌పోతున్నారు. ఇక ఆఫ్రికాలో విచ్చ‌ల‌విడి శృంగారం నేప‌థ్యంలో కండోమ్‌లు లేక‌పోతే ప్ర‌మాద‌కర పరిస్థితులు త‌లెత్త‌వ‌చ్చు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: