కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జనతా కర్ఫ్యూ లాక్ డౌన్ ని ప్రకటించిన మోడీ ప్రత్యేక ప్యాకేజి కూడా పేదలకు ప్రకటించారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో చాలా దేశాల ప్రధానులు విఫలం అయినా వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ విషయంలో దేశం మొత్తం ఆయన మాట విని ఇంటికే పరిమితం అయింది. ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ 21 రోజుల పాటు అమలు కానుంది. పేదల కోసం ఒక లక్షా 70 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్ళల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటీ అనే ఆందోళనకు ఆయన ముగింపు పలికారు. ఇక ఇప్పుడు ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమంలో దీని గురించి మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మన్ కి బాత్ కార్యక్రమంలో తొలిసారి మోడీ కరోనా వైరస్ గురించి మాట్లాడనున్నారు. పేదలు అందరితో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ గురించి పంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనిపై ఆయన పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు నెలల కార్యాచరణ ప్రకటించింది. మీ మొబైల్ లో మన్ కీ బాత్ వినాలి అనుకుంటే 1922కు మిస్‌డ్ కాల్ ఇస్తే చాలు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, నరేంద్రమోదీ మొబైల్ యాప్ లలో మోదీ మన్ కీ బాత్ వినవచ్చు. హిందీ భాషలో ప్రసంగించే ప్రధాని ఉపన్యాసాన్ని అనంతరం ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లోనూ వినవచ్చు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: