మాన‌వాళి మ‌నుగ‌డ‌కు అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతున్న క‌రోనా వైర‌స్‌కు విరుగుడును క‌నిపెట్టే ప‌నిలో ప‌లువురు భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు నిమ‌గ్న‌మ‌య్యారు. ఇప్ప‌టికే వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు సానుకూల దిశ‌గా క‌దులుతున్నాయి. క‌రోనా వైర‌స్‌తో అగ్ర‌రాజ్యం, ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించే అమెరికా కూడా అత‌లాకుత‌లం అవుతోంది. క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌లేక చేతులెత్తేసే ప‌రిస్థితి వ‌స్తోంది. ప్రపంచంలోనే అమెరికాలో ఎక్కువ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. సుమారు ఒక ల‌క్షా ఇర‌వైవేల మందికిపైగా అమెరికా పౌరులు ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. రెండువేల మందికిపైగా మృతి చెందారు. ఇక వైర‌స్ నుంచి ప్ర‌పంచాన్ని కాపాడేందుకు వ్యాక్సిన్‌ను క‌నిపెట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నాయి.. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త‌దేశం నుంచి చేసే ప్ర‌య‌త్నాలే చాలా వ‌ర‌కు సానుకూలంగా ఉన్న‌ట్లు ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు.



హైద‌రాబాద్‌కు చెందిన ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ సీమ‌మిశ్రా( ఫ్యాక‌ల్టీ మెంబ‌ర్ ఆఫ్ ది యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ‌యోకెమిస్ట్రీ) చేస్తున్న ప్ర‌య‌త్నాలు కొంత‌మేర‌కు సానుకూల దిశ‌గా క‌దులుతున్నాయి. క‌రోనా వైర‌స్‌కు విరుగుడుగా పొటెన్షియ‌ల్ వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే.. దీనిపై మ‌రింత ప‌రిశోధ‌న చేయాల్సిన అవ‌సరం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే, బెంగ‌ళూరుకు చెందిన డాక్ట‌ర్ విశాల్ కూడా క‌రోనాకు విరుగుడు క‌నిపెట్టే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ప్రాథ‌మిక ద‌శ నుంచి రెండో ద‌శ‌కు త‌న ప‌రిశోధ‌న చేరుకుంద‌ని ఆయ‌న తెలిపారు. అయితే.. ఇవ‌న్నీ కూడా ప్ర‌య‌త్నాలు మాత్ర‌మే. ఇలాగే.. మ‌రికొంద‌రు కూడా క‌రోనాకు మందును క‌నిపెట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఒక‌వేళ వీరు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలిస్తే మాత్రం.. భార‌త్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన‌ట్టేన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.



నిజానికి.. ఇంత‌టి సాంకేతిక యుగంలో కూడా క‌రోనా వైర‌స్ గురించి అంతుచిక్క‌డం లేదు. అగ్ర‌రాజ్యాలు కూడా ఏమీ చేయ‌లేక చేతులెత్తేస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనా వైర‌స్‌కు భార‌త‌దేశానికి చెందిన ప‌రిశోధ‌కులు మందును క‌నిపెడితే మాత్రం ఈ ప్ర‌పంచాన్ని కాపాడిన వారుగా నిలిచిపోతార‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. క‌రోనా వైర‌స్‌తో ఇప్ప‌టికే 30వేల మందికిపైగా మృతి చెందారు. ఆరుల‌క్ష‌ల‌మందికిపైగా దీని బారిన ప‌డ్డారు. మృతుల్లో ఎక్కువ‌గా ఇట‌లీ, స్పెయిన్‌, చైనా, యూకే, అమెరికాకు చెందిన పైరులే ఉన్నారు. క‌రోనా వైర‌స్‌కు మందుకు క‌నిపెట్టేదాకా మ‌ర‌ణాలను ఆప‌డం క‌ష్ట‌మేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: