కరోనా వైరస్ విస్తరించకుండా ఉండటానికి గానూ అన్ని విధాలుగా తెలుగు రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. కరోనా వైరస్ ని ఇప్పుడు కట్టడి చేయడంలో విఫలం అయితే మాత్రం మున్ముందు మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అప్పుడు దాన్ని అదుపు చేయడం అనేది సాధ్యం కాదు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. కరోనా వైరస్ విషయంలో మన ప్రభుత్వాలు ఇప్పుడు కొన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని మరింత కఠినం గా అమలు చెయ్యాలని చూస్తున్నాయి మన ప్రభుత్వాలు. 

 

కరోనా ఇప్పుడు కట్టడి చేయడం మన చేతుల్లోనే ఉంది. కరోనా కట్టడి చేయడం ప్రభుత్వాలకు ఏ విధంగా సాధ్యమో మనకు కూడా అదే విధంగా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొన్ని నగరాలకు ప్రయాణాలను పూర్తిగా ఆపేయాలని చూస్తుంది. మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చెయ్యాలని చూస్తున్నారు. విజయవాడ నగరాన్ని పూర్తిగా మూసివేయాలని చూస్తుంది. గుంటూరు, ఒంగోలు నగరాలను కూడా పూర్తి స్థాయిలో మూసి వేసే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు హైదరాబాద్ ని కూడా పూర్తిగా మూసి వేయాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తుంది. 

 

ఇందుకోసం కఠినం గా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కొన్ని నగరాలకు రవాణా మార్గాలను పూర్తిగా ఆపేయాలని చూస్తుంది. హైదరాబాద్ నుంచి ఒక్క వాహనం కూడా బయటకు వెళ్ళనీయవద్దని, ప్రజలను పూర్తి స్థాయిలో కట్టడి చెయ్యాలని చూస్తున్నారు. హైదరాబాద్ తో పాటుగా మరిన్ని తెలంగాణా నగరాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ మార్గాలను మూసి వేసే ఆలోచనలో ఉంది. మరింత కఠినం గా వ్యవహరిస్తే మినహా దీన్ని అదుపు చేయలేము అనే అభిప్రాయానికి వచ్చేశారు. ఇక క్వారంటైన్ లో ఉండే వాళ్ళ విషయంలో కూడా మరింత కఠినం గా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: