అటు ప్ర‌పంచ వ్యాప్తంగాను.. ఇటు భారత్‌లో కరోనా మరణ మృదంగం మోగుతూనే ఉంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యికి చేరువవుతోంది. శనివారం ఒక్క రోజే దేశంలో 179 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్కరోజులో ఇన్ని కేసులు వెలుగు చూడడం ఇదే ప్రథమం. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 918కు చేరింది. కరోనాతో శనివారం మహారాష్ట్రలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 19కి ఎగబాకింది. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కు 6, 63, 740 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

 

మ‌ర‌ణాల సంఖ్య 30, 879గా న‌మోదు అయ్యింది. 1,42, 183 మంది రిక‌వ‌రీ అయ్యాయి. ఇంకా 4,90, 678 కేసులు యాక్టివ్‌గానే ఉన్నాయి. క్లోజ్ అయిన కేసుల సంఖ్య 1,73,062 గా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ‌లో శనివారం న‌మోదు అయిన కొత్త కేసుల‌ను కూడా క‌లుపుకుంటే మొత్తం అక్క‌డ 67 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 25 వేల మందిని అక్క‌డ ప్ర‌భుత్వం క్వారంటైన్ చేసింది. తెలంగాణ‌లో లాక్‌డౌన్ చాలా స్ట్రిక్ట్‌గా అమ‌లు అవుతోంది. అలాగే రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. ఇప్పటివరకు కరోనా మరణాలు నమోదుకాకపోవడంతో ప్రజల్లో వైరస్‌పై భయమున్నా, మరణాలు ఉండవన్న ధీమాతో ఉన్నారు. 

 

తాజాగా కరోనా మరణం నమోదు కావడంతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో ఆందోళన నెలకొంది. మృతి చెందిన వ్యక్తి (74)కి సంబంధించి వివరాలను వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఏపీలో గుంటూరు, ప్ర‌కాశం, క‌ర్నూలు జిల్లాల్లో న‌మోదు అయిన పాజిటివ్ కేసుల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ మొత్తం 19 కేసులు న‌మోదు అయిన‌ట్లు అయ్యింది. నిన్న ఒక్క రోజే గుంటూరు జిల్లా మాచ‌ర్ల ప‌ట్ట‌ణానికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్ సోకిందని తేలింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: