ప్రపంచదేశాలను ముప్పుతిప్పలు పెడుతున్న మహమ్మారి కరోనా వైరస్ ఏ రేంజ్‌లో విస్త‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక్క రోజు వ్యవధిలో దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య మ‌రింత భయాందోళనలను కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 660064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 141422 మంది మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో కరోనా మృతుల సంఖ్య 30641కి చేరింది. 

 

ఇదిలా ఉంటే.. క‌రోనా వైరస్ భారత్‌లో సైతం విజృంభిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. 15 మందికి వైరస్ పాజిటివ్ ఉండగా... ఒకరు చనిపోయారు కూడా. దీంతో  పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కీలక నిర్ణయం తీసుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నారు. అయితే మ‌రోవైపు ఇటీవలే చెన్నై నుంచీ బెంగాల్ పురూలియాలోని బలరాంపూర్‌లో ఉన్న వంగిడి గ్రామ ప్రజలు ప్రధాని కోరినట్లుగా చెట్లపై లాక్ డౌన్ విధించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. 

 

అందుకు ప్ర‌ధాన కార‌ణం వారు పేద‌వారు కావ‌డ‌మే. వాళ్లు ఇళ్లు చాలా చిన్న‌వి. ఒకటే గది లాంటి ఇంట్లో అందరూ నివసించాల్సి ఉంటుంది. అలా కలిసి ఉంటే కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండటంతో తమను తాము క్వారంటైన్ చేసుకోవడంలో భాగంగా చెన్నై నుంచి వచ్చిన వాళ్లు ఇలా చెట్లెక్కి ఆ కొమ్మలపైనే పరదాలు వేసుకొని నానా తిప్పలు పడుతూ అక్కడే ఉంటున్నారు. అంతేకాకుండా చెట్లపై నుంచి పడి తమ ప్రాణాలు పోయినా పర్వాలేదంటున్నారే తప్ప తాము మాత్రం తమ ఇళ్లలోకి వెళ్లబోమని అంటున్నారు. అలా వెళ్తే తమకు కరోనా వైరస్ ఉంటే... తమ వాళ్లకు అది వ్యాపిస్తుందనీ అవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇది తెలిసిన వారంద‌రూ వాళ్ల మాన‌వ‌త్వాన్ని శ‌భాష్ అని మెచ్చుకుంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: