దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. ఉత్తర, దక్షిణ భారత దేశం లో ఈ వైరస్ గ్రామ స్థాయి లో విస్తరించడంతో ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సాధారణంగా లాక్ డౌన్ ప్రకటిస్తే కరోన కేసులు అదుపులోకి వస్తాయని భావించారు. అదుపులోకి రాక పోగా ప్రతి రోజు వంద నుంచి 130 కేసులు నమోదు కావడంతో ఇప్పుడు దీన్ని కట్టడి చేయడం ఏ విధంగా సాధ్యమవుతుంది అని అర్థం కాని పరిస్థితి . లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ప్రభుత్వాలు కొన్ని అంచనాలు వేసాయి. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు ఉండవని భావించాయి. 

 

కాని అనూహ్యంగా కరోనా వైరస్ ఇప్పుడు సరి కొత్తగా విస్తరించడం మొదలు పెట్టింది. కుటుంబం లో ఉండే వ్యక్తులకు భాదిత వ్యక్తి నుంచి కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకుతుంది. తెలంగాణలో నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో దాదాపు ముప్పై కేసులు ఈ విధంగా నమొదు అయినవే. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు విస్తరిస్తుంది. ఇది ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు అనే వ్యాఖ్యలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.  

 

ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం, దీనితోనే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. దీన్ని కట్టడి చేయడానికి అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా సరే ఇది మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలను  ఇదే సమస్య వేధిస్తుంది. గ్రామ స్థాయిలో విస్తరించడానికి ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఒకరితో ఒకరికి కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వైరస్ వేగంగా విస్తరిస్తుంది. అది బయట పడే వరకు సోకింది అనే విషయం కూడా ఎవరికి అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు బయటపడే కేసుల్లో అగ్ర భాగం ఇవే కావడంతో వినూత్నంగా ముందుకి వెళ్ళాలి అని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: