ప్రపంచ దేశాలని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి చైనా దేశంలోని వుహాన్ నగరంలో విజృంభించిందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఏ వ్యక్తికి మొట్టమొదటిగా కరోనా వైరస్ సోకిందో మూడు నెలల వరకు మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ తాజాగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, లండన్ కు చెందిన మిర్రర్ యూకే వార్తా సంస్థలు మొట్టమొదటి కరోనా పేషెంట్ ని గురించి ఆమె గురించి పూర్తి కథనాన్ని ప్రచురించాయి.



ఆ రెండు కథనాల పత్రికల ప్రకారం... వుహాన్ సిటీలోని హ్యూనన్ చాపల మార్కెట్ లో రొయ్యలను అమ్మే ఓ మహిళా వ్యాపారి 'వెయ్ గుయిగ్జియాన్' కి దగ్గు, జలుబు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఐతే మొదటిలో ఆమె తనకు వచ్చింది సాధారణమైన దగ్గు, జలుబు అని భావించి... తన రొయ్యల వ్యాపారాన్ని అలాగే కొనసాగించింది. వుహాన్ సిటీ లో హ్యూనన్ చేపల మార్కెట్ చాలా పాపులర్. అందుకే, ఈమె వద్దకు రోజుకి వందల మంది రొయ్యలను కొనడానికి వచ్చేవారు. ఈ క్రమంలోనే ఆమె తుమ్మడం, చేతులతో చీమిడిని తుడుచుకోవడం, అదే చేతులతోనే రొయ్యలని పట్టుకుని అమ్మడం లాంటివి చేసింది. దాంతో కేవలం కొన్ని రోజుల్లోనే ఆమె లో ఉన్న వైరస్ వేల మందికి సోకింది. అయితే డిసెంబర్ 10వ తేదీన ఆమెకు దగ్గు తో పాటు బాగా జ్వరం కూడా రావడంతో తాను స్థానిక క్లినిక్ కి వెళ్ళిగా అక్కడి వైద్యుడు ఆమెకు జలుబు, దగ్గు, జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ లు వేసి పంపించేశాడు. కానీ వారం రోజులు గడిచినా ఆమె కి దగ్గు, జ్వరం తగ్గలేదు. దాంతో ఆమె ఎలెవంత్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా... నయం కాలేదు కానీ జ్వరం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో భయాందోళనకు గురైన వెయ్ గుయిగ్జియాన్ కుటుంబ సభ్యులు ఆమెను వుహాన్ సిటీ లోని అత్యాధునికమైన వుహాన్ యూనియన్ ఆసుపత్రికి తరలించారు.



డిసెంబర్ 16వ తేదీన... అక్కడి వైద్యులు ఆమె రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించగా రెండు రోజుల్లో ఫలితాలు వచ్చాయి. అయితే ఆ పరీక్ష ఫలితాలలో ఆమెకి ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయిన యూనియన్ ఆస్పత్రి వైద్యులు... ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని... ఈ భయంకరమైన వైరస్ ఎంతోమందికి సంక్రమించి ఉంటుందని వుహాన్ ప్రభుత్వానికి తెలియజేశారు. తక్షణమే స్పందించిన వుహాన్ ప్రభుత్వం హ్యూనన్ చాపల మార్కెట్ ని మూసివేసింది. మరోవైపు వెయ్ గుయిగ్జియాన్ ని క్వారంటైన్ కి తరలించారు వైద్యులు. ఐతే దాదాపు 14 రోజుల పాటు చికిత్స పొందిన ఆమె పూర్తిగా కోలుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తనకు సోకినది కరోనా వైరస్ అని అనుకోలేదని... అనారోగ్యంగా ఉన్నపుడు తన వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున నిర్వహించానని... అందువల్లే చాలా మందికి ఈ వైరస్ సోకి ఉండొచ్చని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle

 


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: